గన్నవరం నడిబొడ్డున నారా లోకేష్ శపథం- ఊర మాస్ వార్నింగ్..!!

విజయవాడ: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ఇవ్వాళ్టికి 191వ రోజుకు చేరుకుంది. ప్రస్తుతం ఈ ఎన్టీఆర్ జిల్లాలో కొనసాగుతోంది. ఇప్పటికే విజయవాడలో పాదయాత్రను పూర్తి చేసుకున్నారాయన. గన్నవరం నియోజకవర్గంలో అడుగు పెట్టారు. అక్కడ భారీ బహిరంగసభను ఏర్పాటు చేశారు.

ఎన్టీఆర్, కృష్ణాజిల్లాలకు చెందిన పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ సభకు హాజరయ్యారు. మాజీ మంత్రులు దేవినేని ఉమా మహేశ్వర రావు, కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్ రావు, బోండా ఉమా మహేశ్వర రావు, బుద్ధా వెంకన్న, వైసీపీ నుంచి టీడీపీలో చేరిన యార్లగడ్డ వెంకట్రావ్.. ఇలా పలువురు నేతలు ఈ సభలో పాల్గొన్నారు.

Nara Lokesh Warning To Kodali Nani

ఈ సభలో నారా లోకేష్ వైఎస్ఆర్సీపీ నేతలపై ఘాటు విమర్శలు చేశారు. ప్రత్యేకించి- మాజీ మంత్రి, గుడివాడ వైఎస్ఆర్సీపీ శాసన సభ్యుడు కొడాలి నాని, గన్నవరం టీడీపీ రెబెల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీలను టార్గెట్‌గా చేసుకున్నారు. వారిద్దరినీ ఉద్దేశించి తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేశారు.

పేకాట క్లబ్బులు, గుట్కా తప్ప మరే విషయం మీదా కొడాలి నానికి అవగాహన లేదని నారా లోకేష్ విమర్శించారు. కొడాలిని సన్నబియ్యం సన్నాసిగా అభివర్ణించారు. నిండు శాసన సభలో తన తల్లిని అవమానించి.. చాలా పెద్ద తప్పు చేశాడని, దీనికి తగిన మూల్యాన్ని చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.

ఇంకో తొమ్మిది నెలల్లో వచ్చేది తమ ప్రభుత్వమేనని, గుడివాడలో కొడాలి నానిని అర్ధనగ్నంగా ఊరేగించే బాధ్యత తాను తీసుకుంటానని శపథం చేశారు. వైఎస్ఆర్సీపీ నాయకులు చేసిన తప్పులన్నింటినీ ఎర్రబుక్‌లో రాసుకుంటోన్నానని, వాటన్నింటినీ తిరిగి ఇస్తామని, రాష్ట్రం వదిలి వెళ్లినా వెంటబడతామని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+