India
  • search
  • Live TV
అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పప్పూ పిన్నిగారిని ఎందుకు చంపావ్- సాయిరెడ్డి ట్వీట్- పైశాచికానందమంటూ లోకేష్ ఫైర్

|
Google Oneindia TeluguNews

ఎన్టీఆర్ కుమార్తె ఉమామహేశ్వరి అనుమానాస్పద మృతిపై వైసీపీ, టీడీపీ మధ్య తీవ్ర మాటల యుద్ధం కొనసాగుతోంది. ఉమామహేశ్వరి మరణానికి చంద్రబాబే కారణమంటూ ఉదయం ట్వీట్ పెట్టిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆ తర్వాత పప్పూ పిన్నిని ఎందుకు చంపావంటూ మరో ట్వీట్ లో ప్రశ్నించారు. దీంతో టీడీపీ నేతలు సాయిరెడ్డి ట్వీట్లపై తీవ్రంగా మండిపడుతున్నారు. ఇదే క్రమంలో నారా లోకేష్ కూడా భగ్గుమన్నారు.

మరణించాక ఎన్టీఆర్‌ శవాన్ని లాక్కున్నారు! కోడెల శివప్రసాద్ కంటే ముందుగా ఆయన సెల్‌ ఫోన్‌కు అంత్యక్రియలు చేశారు! ఇప్పుడు...పప్పుగాడి పిన్ని గారు --చున్నీతో ఉరి వేసుకుందంటున్నారు! ఏం క్రిమినల్స్‌ ఫ్యామిలీరా బాబూ మీది! అంటూ విజయసాయిరెడ్డి ఓ ట్వీట్ చేశారు. మరో ట్వీట్లో వైఎస్ గారి మరణంపై అవమానకరంగా మాట్లాడారు. జగన్ గారిపై హత్యాయత్నం చేయించి కోడి కత్తి అంటూ హేళన చేశారు. బరితెగించినోళ్లకి చంపడం, సుపారీ హత్యలు చేయించడం ఒక లెక్కా? అంటూ సాయిరెడ్డి ప్రశ్నించారు. దీనిపై లోకేష్ మండిపడ్డారు.

nara lokesh slams ysrcp mp vijaya sai reddys sadism with aunts uma maheswaris death

ఉమామహేశ్వరి మరణానికి చంద్రబాబు కుటుంబం, హెరిటేజ్ లో పెట్టుబడులు కారణమంటూ సోషల్ మీడియాలో వైసీపీ వైరల్ చేస్తున్న పోస్టుల్ని తప్పుబడుతూ వాటిని ఫేక్ గా లోకేష్ తెలిపారు. టెన్త్ క్లాస్ పేపర్లు కొట్టేసిన సైకో జగన్ రెడ్డి తన క్రిమినల్ రూపాన్ని మరోసారి బయటపెట్టుకున్నారు. డోర్‌ నెంబర్ కి సర్వే నెంబర్ కి తేడా తెలియని కిరాయిగాళ్లతో మా చిన్నమ్మ మరణంపై విష‌ప్రచారం చేయిస్తున్నారంటూ మండిపడ్డారు. కోడికత్తి డ్రామా, బాబాయ్ గుండెపోటు అంటూ ఆస్కార్ రేంజ్ న‌టన, ఒకే కులం డిఎస్పీలు 35 మందికి ప్ర‌మోష‌న్లు, పింక్ డైమండ్ పేరుతో చేసిన అస‌త్య విష‌ప్ర‌చార‌మేనన్నారు.

నేడు తప్పుడు సర్వే నెంబర్లు సృష్టించి నా చిన్న‌మ్మ ఉమామ‌హేశ్వ‌రి గారి మ‌ర‌ణంపైనా విషప్రచారం చెయ్యబోయి బొక్కబోర్లా పడ్డారు.తండ్రి శ‌వాన్ని అడ్డుపెట్టుకుని సీఎం కావాల‌ని సంత‌కాలు చేసిన నీచ చ‌రిత్ర గ‌లిగిన జ‌గ‌న్‌రెడ్డి, ఎన్నిక‌ల్లో సానుభూతి కోసం బాబాయ్ మ‌ర్డ‌ర్‌నీ వాడుకున్నారు. జ‌నాన్ని దోచి దాచుకుని, నెత్తుటి కూడు తింటూ, త‌ర‌త‌రాల‌ ర‌క్త‌చ‌రిత్రకి వార‌సుడైన జ‌గ‌న్‌రెడ్డీ...చిన్న‌మ్మ మ‌ర‌ణంతో మేము విషాదంలో వుంటే విష‌ప్ర‌చారం చేస్తూ వినోదం పొందుతావా? నీ పైశాచిక ఆనందానికి ఎక్స్‌పెయిరీ డేట్ ద‌గ్గ‌ర ప‌డింది. మీరు చేస్తున్న పాపాలకు ఆ దేవుడి స్క్రిప్ట్ ప్రకారం శిక్ష అనుభవిస్తారు అంటూ లోకేష్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

English summary
ysrcp and tdp stepped into tweet war over ntr's daughter uma maheswari's suspicious death.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X