వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆంధ్రా ఎమ్మెల్యేలతో అక్కడా: జగన్‌పై లోకేష్, కోర్టు పిటిషన్ తోసిపుచ్చిందంటే

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ మంగళవారం ధ్వజమెత్తారు.ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ నెలకు ఒకరోజు కూడా ఏపీ రాజధాని అమరావతికి,

|
Google Oneindia TeluguNews

ఒంగోలు: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ మంగళవారం ధ్వజమెత్తారు.

Recommended Video

పవన్ చెబితేనే సమస్య పరిష్కారమా? లోకేష్ : ‘జగన్ ఏకైక వ్యక్తి’ Nara Lokesh About YS Jagan
నెలకు ఒకరోజు కూడా జగన్ రావడం లేదు

నెలకు ఒకరోజు కూడా జగన్ రావడం లేదు

ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ నెలకు ఒకరోజు కూడా ఏపీ రాజధాని అమరావతికి, విజయవాడకు రావడం లేదని విమర్శించారు. ఆంధ్రా ఎమ్మెల్యేలతో హైదరాబాదులో భేటీలు నిర్వహిస్తున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్ర అభివృద్ధిని వైసీపీ నేతలు అడుగడుగునా అడ్డుకుంటున్నారన్నారు.

రామోజీ రావును కలిసిన జగన్, ముప్పావు గంట చర్చ, ఎందుకు?రామోజీ రావును కలిసిన జగన్, ముప్పావు గంట చర్చ, ఎందుకు?

నిధులు రాకుండా వైసిపి ఎంపీలు లేఖ రాశారు, కానీ

నిధులు రాకుండా వైసిపి ఎంపీలు లేఖ రాశారు, కానీ

ఉపాధి హామీ పథకానికి నిధులు రాకుండా వైసిపి ఎంపీలు కేంద్రానికి లేఖ రాశారని నారా లోకేష్ ఆరోపించారు. అయితే, వాస్తవాలను గుర్తించిన కేంద్రం ఆ తర్వాత మళ్లీ నిధులను విడుదల చేసిందన్నారు. ఆయన ప్రకాశం జిల్లాలో పలు అభివృద్ధి పథకాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడారు.

దేశ చరిత్రలో జగన్ అంత ఆర్థిక నేరగాడు మరొకరు లేరు

దేశ చరిత్రలో జగన్ అంత ఆర్థిక నేరగాడు మరొకరు లేరు

అంతకుముందు ఏపీ టిడిపి అధ్యక్షులు, మంత్రి కళా వెంకట్రావు.. జగన్‌పై నిప్పులు చెరిగారు. దేశ చరిత్రలో జగన్ అంత ఆర్థిక నేరగాడు మరొకరు లేరన్నారు. కేవలం తనపై ఉన్న కేసులను మాఫీ చేసుకునేందుకే పార్టీని నడుపుతూ ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. నంద్యాలతో జగన్ పని అయిపోయిందన్నారు.

జగన్ పిటిషన్ తోసిపుచ్చిందంటే... అదీ కేసు తీవ్రత

జగన్ పిటిషన్ తోసిపుచ్చిందంటే... అదీ కేసు తీవ్రత

జగన్‌ పాదయాత్రల పేరుతో ప్రజలను మభ్యపెట్టాలనుకోవడం అవివేకమని టిడిపి కృష్ణా జిల్లా అధ్యక్షులు బచ్చుల అర్జునుడు అన్నారు. కోర్టు హాజరుకు మినహాయింపు ఇవ్వాలన్న జగన్‌ పిటిషన్‌ను సీబీఐ కోర్టు తోసిపుచ్చడాన్ని బట్టి కేసుల తీవ్రతను అర్థం చేసుకోవచ్చన్నారు. ప్రతిపక్ష నాయకుని హోదాకే తలవంపులు తెచ్చేలా వ్యవహరిస్తున్న జగన్‌ పాదయాత్ర పేరుతో ఎన్ని అసత్యాలు ప్రచారం చేయాలనుకున్నా ప్రజలు నమ్మేస్థితిలో లేరన్నారు.

ప్రజలు నమ్మేస్థితిలో లేరు

ప్రజలు నమ్మేస్థితిలో లేరు

ప్రభుత్వ పనితీరు పట్ల ఆయన ఎన్ని విమర్శలు చేసినా ప్రజలు టిడిపి పాలన పట్ల పూర్తి సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని అర్జునుడు అన్నారు. నిరంతర విద్యుత్తు సరఫరా పట్ల ప్రజలకు, ముందుచూపుతో పట్టిసీమ నిర్మాణం ద్వారా రైతులకు భరోసా కల్పించిన ఘనత చంద్రబాబుదే అన్నారు. ఏ రాజకీయ పార్టీకి సాధ్యంకాని విధంగా పార్టీ కార్యకర్తల సంక్షేమానికి కృషి చేస్తున ఏకైక పార్టీ టిడిపి అన్నారు.

English summary
Telugu Desam party leader and Minister Nara Lokesh takes on YSR Congress Party chief YS Jaganmohan Reddy on Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X