ఇంతేనా: జగన్‌కు దుమ్ముదులిపిన లోకేష్, మోడీకిచ్చిన ఇన్విటేషన్ ఖరీదు తక్కువే!

గుంటూరు: తనకు రాజధాని అమరావతి శంకుస్థాపనకు ఆహ్వానం పంపించవద్దన్న వైసిపి అధ్యక్షుల వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన టిడిపి యువనేత, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్‌లో విమర్శలు గుప్పించారు. లోకేష్ గురువారం ట్వీట్ చేశారు.

జగన్ తీరు పైన లోకేశ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఐదు కోట్ల మంది ప్రజల కలల రాజధానిగా నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి నిలవబోతోందన్న ధ్యాసే జగన్‌ను నిలువనీయడం లేదన్నారు. అమరావతి శంకుస్థాపనకు రానని చెప్పడం జగన్‌కు తగదన్నారు.

అక్రమ మార్గాల్లో సంపాదించిన తన లక్ష కోట్ల సంపదను జగన్ రాజధాని నిర్మాణానికి అందిస్తే బాగుంటుందన్నారు. ప్రభుత్వంపై అనవసర విమర్శలు చేయడం మానుకోవాలన్నారు. జగన్ ఇప్పటికైనా మనసు మార్చుకోవాలని హితవు పలికారు.

Nara Lokesh takes on YS Jagan mohan reddy

అమరావతి.గవ్.ఇన్‌కు తొలుత జగన్ తన లక్ష కోట్లు విరాళంగా ఇచ్చి మనసు మార్చుకోవడం ప్రారంభించాలని అభిప్రాయపడ్డారు.

అమరావతి శంకుస్థాపన వేడుకలో జగన్ పాల్గొనకపోవడం దురదృష్టకరమని, ఇది ఐదు కోట్ల ఆంధ్రుల కల అని, జగన్ తన మైండ్ సెట్ మార్చుకోవాలని, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పైన, ప్రభుత్వం పైన అనవసర ఆరోపణలు చేయవద్దన్నారు.

ప్రధాని మోడీకి ఇచ్చిన ఆహ్వాన పత్రిక ఖరీదు రూ.70వేలు

అమరావతి శంకుస్థాపన కలకాలం గుర్తుండేలా నిర్వహించేందుకు ఏపీ ప్రభుత్వం నడుం బిగించిన విషయం తెలిసిందే. ఇటీవల ఢిల్లీ పర్యటనలో ఏపీ సీఎం నారా చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోడీకి ఆహ్వాన పత్రికను అందించారు. ఈ ఆహ్వాన పత్రిక కోసం కేవలం రూ.70 మాత్రమే ఖర్చు చేసినట్లు మంత్రులు వెల్లడించారు.

శంకుస్థాపన కోసం కేటాయించిన నిధుల్లో గుంటూరు కలెక్టర్ రూ.7 కోట్లు, విజయవాడ కలెక్టర్ రూ.2 కోట్లు మాత్రమే విడుదల చేసినట్లు చెప్పారు. కార్యక్రమానికి రాజకీయ ప్రముఖులతో పాటు వ్యాపార దిగ్గజాలు కూడా వస్తున్నందున వారి కోసం ప్రత్యేకంగా హెలిప్యాడ్‌లు ఏర్పాటు మినహా ఎక్కడా దుబారా లేదన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+