జగన్ నా వెంట్రుక కూడా పీకలేరు-దావోస్ లో ఎవరూ పట్టించుకోలేదు-లోకేష్ కామెంట్స్
ఏపీలో వైసీపీ వర్సెస్ టీడీపీగా సాగుతున్న రాజకీయ పోరులో మాటల యుద్ధం కొవసాగుతోంది. మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్టు సందర్భంగా కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించిన కేసులో టీడీపీ ఎమ్మెల్యే లోకేష్ ఇవాళ విజయవాడ కోర్టుకు హాజరయ్యారు.ఈ సందర్భంగా లోకేష్ .. తనపై పెట్టిన కేసులు, సీఎం జగన్ దావోస్ టూర్, వైసీపీ ఎమ్మెల్సీ డ్రైవర్ హత్యకేసు వంటి విషయాలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
సీఎం జగన్ తనను ఏమీ పీకలేరని టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నో కోట్ల కుంభకోణాలకు పాల్పడ్డానని తనపై అసత్య ఆరోపణలు చేసి ఏమీ పీకలేక కోవిడ్ నిబంధనల ఉల్లంఘనల కేసులో కోర్టుకు తీసుకొచ్చారని సీఎం జగన్ పై లోకేష్ మండిపడ్డారు. ఇప్పటి వరకు తనపై 14 కేసులు పెట్టి ఏం పీకారని ప్రశ్నించారు. కావాలంటే మరో 10కేసులు పెట్టుకోవాలని సలహా ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ తగ్గేది లేదని స్పష్టం చేశారు. ఏ తప్పు చేయలేదు కాబట్టే కోర్టుకు వచ్చానని, జగన్ లా వాయిదాలు తీసుకోవట్లేదని టీడీపీ నేత తెలిపారు. ప్రజలు రాళ్లతో కొట్టించుకునే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి తెచ్చుకుంటున్నారన్నారు. 2016 నుంచి తపపై చేసిన అవినీతి ఆరోపణలపై చర్చకు సిద్ధమని... తన అవినీతి కేసులపై చర్చకు జగన్ సిద్ధమా అని సవాల్ విసిరారు.

సీఎం జగన్ దావోస్ పర్యటనపైనా లోకేష్ పలు వ్యాఖ్యలు చేశారు. పెట్టుబడుల కోసం జగన్ దావోస్ వెళ్లినట్లు లేదని, అక్కడ వైసీపీ నేతల మీటింగ్ జరుగుతున్నట్లే ఉందని విమర్శించారు. పారిశ్రామిక వేత్తలు ఎవరూ జగన్‌ను కలవడానికి రావడం లేదన్నారు. గత 24 గంటల్లో జగన్‌ను కలిసిన ఏకైక పారిశ్రామిక వేత్త ఆదానీ అని చెప్పుకొచ్చారు. ఏపీ రాజధాని ఏదంటే జగన్ ఏం సమాధానం చెబుతారని లోకేష్ ప్రశ్నించారు.
ఎమ్మెల్సీ ఆనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్యపైనా లోకేష్ తీవ్రంగా స్పందించారు. సొంత పార్టీ కార్యకర్తను కొట్టి చంపేసినా ఆ కుటుంబాన్ని కాపాడలేని పరిస్థితిల్లో జగన్ ఉన్నారన్నారు. 72 గంటల్లో ఎమ్మెల్సీ అనంతబాబు... సజ్జల సహా వైసీపీ ముఖ్య నేతలను కలిశారని ఆయన తెలిపారు. ఎమ్మెల్సీకి భద్రత కల్పించేది పోలీసులే అని అన్నారు. ఎమ్మెల్సీ అనంతబాబు తాడేపల్లి ప్యాలెస్‌లోనే ఉన్నాడా. నేను కోర్టుకు వస్తే, 500మంది పోలీసులు వచ్చారు. నా చుట్టూ తిరిగే పోలీసులు ఎమ్మెల్సీ అనంతబాబుని పట్టుకోండి. ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సుబ్రహ్మణ్యం కుటుంబానికి రూ.2కోట్లు, పొలం ఇస్తానని ప్రలోభ పెట్టారని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.