వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనా అరికట్టటానికి చిట్కాలు చెప్పిన నారా లోకేష్ ..ఏం చెప్పారంటే

|
Google Oneindia TeluguNews

కరోనా వ్యాప్తిని అరికట్టడం కోసం ప్రపంచమే పెద్ద ఎత్తున పరిశోధనల్లో ఉంది . ఇక కరోనా కట్టడి ఎలా అనే అంశంపై ఎవరికి తోచిన చిట్కాలు వారు చెబుతున్నారు. లాక్ డౌన్‌ను పాటిస్తూ ప్రజలెవరూ బయటకు రావొద్దని ఇప్పటికే ప్రభుత్వాలు ప్రజలకు సూచించాయి. అయినా ప్రజలు తమ నిత్యావసరాల కోసం బయటకు వస్తున్న పరిస్థితి . ఇక ఏపీ సర్కార్ కరోనాను నియంత్రించటానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది.

ఇక ఇదే సమయంలో తాజాగా కరోనా వ్యాప్తిని అరికట్టే మరో చిట్కాను ట్విట్టర్ ద్వారా వివరించారు టీడీపీ యువనేత, మాజీమంత్రి నారా లోకేశ్. కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి కొన్ని దేశాలు తలపట్టుకుంటుంటే కొరియాలాంటి దేశాల్లో చిన్న చిట్కాలతో కరోనాకి చెక్ పెట్టారు. అందులో ప్రధానమైనది అలవాటైన చేతిని ఎక్కువగా వాడకపోవడమే అని నారా లోకేశ్ వివరించారు. మీది కుడిచేతి వాటం అయితే ఎడమచేతితో, ఎడమచేతి వాటం అయితే కుడిచేతితో తలుపులు తియ్యడంలాంటి పనులు చెయ్యండి. తద్వారా ఆ చేతితో మొహాన్ని తాకడం తగ్గుతుంది అని పేర్కొన్నారు.

Nara Lokesh Tips for Preventing Corona

Recommended Video

Janatha Curfew:European Countries Are Already implementing what Modi Said To D On Marc 22nd

ఈ చిన్న జాగ్రత్త కొంతవరకూ కరోనా బారిన పడకుండా ఆపుతుంది అని నారా లోకేష్ చిట్కా చెప్పారు. ఇక అంతే కాదు ఇది కేవలం ఒక చిట్కా మాత్రమే. రెండు చేతులను శుభ్రంగా కడుక్కోవడం తప్పనిసరి అని మరో జాగ్రత్త కూడా చెప్పారు. ఇక కరోనాను నియంత్రించటానికి 5 సూత్రాలు అంటూ కరోనా కట్టడికి చేసిన వీడియోను పోస్ట్ చేసిన నారా లోకేష్ ఈ 5 సూత్రాలు కచ్చితంగా పాటిద్దాం.. కలిసికట్టుగా కరోనావైరస్‌ వ్యాప్తిని అరికడదాం అంటూ పేర్కొన్నారు.

English summary
Another tip to stop the spread of coronavirus via Twitter is TDP former minister Nara Lokesh. Corona has checked in with little tips in countries like Korea if some countries are looking to counter the corona epidemic. Nara Lokesh explained that the main reason for this is the overuse of the habitual hand.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X