గ్రేటర్ విశాఖలో నారా లోకేష్
Nara Lokesh: రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల గడువు సమీపిస్తోన్న నేపథ్యంలో- ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ తన ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేసింది. మొన్నటివరకు పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు రా.. కదలిరా బహిరంగ సభలను నిర్వహిస్తోన్నారు.
గ్రేటర్ విశాఖలో నారా లోకేష్..!#NaraLokesh #Vishakapatnam #Shankharavam #AndhraPradesh #Oneindiatelugu pic.twitter.com/Try8g471CR
— oneindiatelugu (@oneindiatelugu) February 18, 2024
అదే సమయంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్.. రోడ్డెక్కారు. శంఖారావం పేరుతో బహిరంగ సభలను నిర్వహిస్తోన్నారు. జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం ఉత్తరాంధ్రలో పర్యటిస్తోన్నారాయన. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఆయన పర్యటన ముగిసింది.

విశాఖపట్నం జిల్లాలో అడుగు పెట్టారు. ఇప్పటికే భీమిలీలో శంఖారావం సభలో ప్రసంగించారు. నేడు గ్రేటర్ విశాఖలో ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. శంఖారావం సభలో పాల్గొననున్నారు. ఈ సభకు గ్రేటర్ విశాఖ టీడీపీ నాయకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. టీడీపీ ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాస్, వెలగపూడి రామకృష్ణబాబు సహా పలువురు నాయకులు ఇందులో పాల్గొననున్నారు.

ప్రచార సభలను ప్రారంభించడానికి ముందు నారా లోకేష్ సింహాచలం ఆలయాన్ని దర్శించారు. శ్రీవరాహ లక్ష్మీనరసింహస్వామివారి సేవలో పాల్గొన్నారు. ఈ ఉదయం ఆలయానికి వచ్చిన లోకేష్‌ను అర్చకులు, దేవస్థానం పాలకమండలి సభ్యులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. దర్శనానంతరం స్వామితీర్థ ప్రసాదాలను అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని స్వామివారిని కోరుకున్నట్లు చెప్పారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో శంఖారావం బహిరంగ సభలకు పెద్ద ఎత్తున ఆదరణ లభించిందని, గ్రేటర్ విశాఖపై పట్టు నిలుపుకొంటామని అన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిని ప్రభుత్వం విస్మరించిందని వ్యాఖ్యానించారు












Click it and Unblock the Notifications