వైసీపీకి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చి తీరుతా: నారా లోకేష్!!
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్ కేసులో ఏ 14 నిందితుడిగా టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పేరును చేర్చిన విషయం తెలిసిందే .ఈ క్రమంలో నారా లోకేష్ స్పందించారు. త్వరలో తాను యువ గళం పాదయాత్ర ప్రారంభించబోతున్నానని, దానిని అడ్డుకోవడం కోసమే ఇలా అడ్డమైన కేసులలో తన పేరును పెడుతున్నారని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
తనకు ఏ 14 గా అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు స్కాం కేసులో వైసిపి గిఫ్ట్ ఇస్తే, తాను వైసీపీకి రిటర్న్ గిఫ్ట్ కచ్చితంగా ఇచ్చి తీరుతానని లోకేష్ చెప్పుకొచ్చారు. దేశ రాజధాని ఢిల్లీలో రాష్ట్రపతిని కలిసిన అనంతరం లోకేష్ మీడియాతో మాట్లాడారు. తనకు సంబంధం లేని అంశంలో తన పేరు చేర్చారని పేర్కొన్న లోకేష్, అసలు ఇన్నర్ రింగ్ రోడ్డు తో తనకి ఏంటి సంబంధం అంటూ ప్రశ్నించారు.

అమరావతిలో ఇన్నర్ రింగ్ రోడ్డే లేదని, అలాంటప్పుడు అసలు కేసు ఏమిటో చెప్పాలని లోకేష్ ప్రశ్నించారు. ఇన్నర్ రింగ్ రోడ్ లేని చోట రెండేళ్ల పాటు విచారించి తనను నిందితుడిగా ఎలా చేరుస్తారు అంటూ లోకేష్ ప్రశ్నించారు. స్కిల్ డెవలప్మెంట్ స్కాం కు, తనకు సంబంధం ఏమిటని ప్రశ్నించిన లోకేష్ కావాలని కేసులలో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.
ఫైబర్ గ్రిడ్ కేసులో తనకు సంబంధం లేదని, రోజుకో వదంతులతో, రోజుకో కేసులతో వేధింపులకు గురి చేస్తున్నారని లోకేష్ మండిపడ్డారు. తప్పనిసరిగా రిటర్న్ గిఫ్ట్ ఇచ్చే బాధ్యతను తీసుకుంటానని పేర్కొన్న లోకేష్ ఇలాంటి కేసులకు తాము భయపడేది లేదని స్పష్టం చేశారు.
ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో నా పేరు కూడా చేర్చారు. తప్పకుండా జగన్ కు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చే బాధ్యత తీసుకుంటా - టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ #NaraLokesh #CBNLifeUnderThreat#TDPJSPTogether#APvsJagan#IAmWithBabu#PeopleWithNaidu#FalseCasesAgainstNaidu… pic.twitter.com/PO8TttWb0g
— Telugu Desam Party (@JaiTDP) September 26, 2023
టిడిపి హయాంలో తాను మంత్రిగా పని చేశానని, తాను పనిచేసిన శాఖలు వేరు, తనపై అభియోగాలు మోపిన శాఖలు వేరని లోకేష్ పేర్కొన్నారు. చంద్రబాబు అరెస్టుపై జాతీయ స్థాయిలో ఉద్యమం చేస్తున్న తరుణంలో అడ్డుకోవడం కోసం తనపై ఆరోపణలు చేస్తున్నారని లోకేష్ పేర్కొన్నారు.
ప్రతిపక్షాలు రోడ్డు మీదకి రాకూడదన్న ఉద్దేశంతో కేసులు పెట్టి జైలుకు పంపాలని వైసీపీ కుట్రలు చేస్తుందన్నారు. ప్రజల సొమ్ము తినాల్సిన అవసరం తనకు గాని, తన తండ్రికి కానీ, తన కుటుంబ సభ్యులకు గానీ, తమ పార్టీ సభ్యులకు గానీ లేదని లోకేష్ పేర్కొన్నారు ప్రభుత్వానికి మరో ఆరు నెలల్లో రిటర్న్ గిఫ్ట్ ఇచ్చి తీరుతామని లోకేష్ స్పష్టం చేశారు.
-
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..!












Click it and Unblock the Notifications