APPSC: గ్రూప్ ఎగ్జామ్స్ వయో పరిమితి పెంపు - సీఎం జగన్ కు లోకేష్ లేఖ

ఏపీలో ఎన్నికల వేళ వైసీపీ సర్కార్ ఏపీపీఎస్సీ ద్వారా తాజాగా గ్రూప్ 1, గ్రూప్ 2 పరీక్షల నోటిఫికేషన్లను విడుదల చేయించింది. దీంతో నాలుగేళ్లుగా ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్ధులు ఈ పరీక్షలు రాసేందుకు సన్నద్ధమవుతున్నారు. అయితే ఏళ్ల తరబడి ఉద్యోగ నోటిఫికేషన్లు రాకపోవడంతో చాలా మంది అభ్యర్ధులు ఏపీపీఎస్సీ నిర్దేశించిన వయో పరిమితి పరిధిలోకి రావడం లేదు. దీంతో వీరంతా తాజాగా ప్రకటించిన నోటిఫికేషన్లలో పేర్కొన్న పరీక్షలు రాసేందుకు అనర్హులవుతున్నారు.

ఏపీపీఎస్సీ తాజాగా గ్రూప్ 1, గ్రూప్ 2 పరీక్షలకు నోటిఫికేషన్లు విడుదల చేసింది. పలు కేటగిరీల్లో ఉద్యోగాలకు జనవరి 10 లోపు దరఖాస్తు చేసుకోవాలని అభ్యర్ధులకు సూచించింది. దీంతో అభ్యర్ధులు ఆయా ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకుంటున్నారు.ఈ నేపథ్యంలో ఏపీపీఎస్సీ గ్రూప్ పరీక్షలు రాసేందుకు సాధ్యమైనంత ఎక్కువ మందికి అర్హత కల్పించేలా వయో పరిమితి పెంచాలని టీడీపీ నేత నారా లోకేష్ ఇవాళ ప్రభుత్వాన్ని కోరారు.

nara lokesh wrote cm ys jagan over age limit increase for appsc group exams

ఈ మేరకు ఆయన సీఎం వైఎస్ జగన్ కు లేఖ రాశారు. గ్రూప్ పరీక్షల్లో పోటీ పడే అభ్యర్ధుల వయో పరిమితిని 44 ఏళ్లకు పెంచాలని ఆయన కోరారు. ఉద్యోగాల భర్తీ కోసం తెలంగాణలో అనుసరిస్తున్న విధానమే ఇక్కడా అమలు చేయాలని లోకేష్ ప్రభుత్వాన్ని కోరారు.

నాలుగేళ్లుగా ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా నిరుద్యోగులు ఉద్యోగాలకు దూరమయ్యారని, ఇప్పుడు ప్రకటించిన నోటిఫికేషన్లలో వయో పరిమితి సడలింపు ఇవ్వాలని నారా లోకేష్ సీఎం వైఎస్ జగన్ ను కోరారు. వార్షిక జాబ్ క్యాలెండర్ జారీలో ప్రభుత్వం విఫలమైందని లోకేష్ విమర్శించారు. ఇప్పుడు ఎన్నికల సమయంలో హడావిడిగా ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇస్తున్నారని నారా లోకేష్ మండిపడ్డారు. ఈ మేరకు సీఎం జగన్ కు రాసిన లేఖలో పలు అంశాల్ని ఆయన ప్రస్తావించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+