కరెక్ట్ అయితే లోకేష్ రాజీనామా..! తప్పయితే జగన్ సారీ..!

ఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతున్న నేపథ్యంలో అధికార, విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఇదే క్రమంలో తాజాగా కడపలో నిర్వహించిన మహానాడులో మంత్రి నారా లోకేష్ వైఎస్ జగన్ కు ఓ సవాల్ చేశారు. అదే సవాల్ ను ఆయన ఇవాళ మళ్లీ రిపీట్ చేసారు. ఈ సవాల్ లో తాను నెగ్గితే జగన్ ఏం చేయాలో, జగన్ నెగ్గితే తానేం చేస్తానో కూడా లోకేష్ స్పష్టంగా చెప్పేశారు.

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం తాజాగా విశాఖలో ఉర్సా అనే సంస్థకు 99 పైసలకే ఎకరం చొప్పన భూకేటాయింపులు చేసిందని విపక్ష వైసీపీ అధినేత వైఎస్ జగన్ పదే పదే ఆరోపిస్తున్నారు. వైసీపీ నాయకులు, మాజీ మంత్రులు సైతం ఇదే వాదనను తెరపైకి తెస్తున్నారు. దీనికి ఇప్పటికే పలుమార్లు ప్రభుత్వం వైపు నుంచి, అధికార కూటమి వైపు నుంచి వివరణ ఇచ్చారు. అయినా అదే ఆరోపణను జగన్ కొనసాగిస్తుండటంతో ఈసారి మంత్రి లోకేష్ ఎక్స్ లో రాజీనామా సవాల్ విసిరారు.

nara Lokesh s resignation challenge to ys jagan- here are details

వైఎస్ జగన్ గారికి ఓపెన్ ఛాలెంజ్ అంటూ మొదలుపెట్టిన నారా లోకేష్.. మీరు చేసిన ఆరోపణలు నిరూపిస్తే నేను నా మంత్రి పదవికి రాజీనామా చేస్తానని తెలిపారు. మీరు చేసిన ఆరోపణలు తప్పని తేలితే రాష్ట్ర యువతకు క్షమాపణ చెప్పండి చాలు అన్నారు. ఆరోపణలు చేయడం, పారిపోవడం జగన్ రెడ్డి గారికి కొత్తేమీ కాదన్నారు. ఉర్సా కంపెనీకి విశాఖపట్నంలో ఎకరం రూపాయికే భూములు కట్టబెట్టారు అంటూ మీరు తీవ్ర ఆరోపణ చేశారు,నేను స్పష్టంగా మరోసారి చెబుతున్నా.. ఉర్సా కంపెనీకి విశాఖలోని ఐటి పార్క్ హిల్ - 3 లో ఎకరం కోటి రూపాయలు చొప్పున మూడున్నర ఎకరాలు కేటాయించామన్నారు.

కాపులుప్పాడలో ఎకరం యాభై లక్షల చొప్పున 56.36 ఎకరాలు కేటాయించామని లోకేష్ తెలిపారు. బురదజల్లి ప్యాలస్ లో దాక్కోవడం కాదని, చేసిన ఆరోపణలు నిరూపించండని లోకేష్ జగన్ ను కోరారు. ఛాలెంజ్ కు సిద్ధమా జగన్ రెడ్డి గారు? మీ ఐదేళ్ల విధ్వంస పాలనలో ఒక్క కంపెనీ తీసుకురాకపోగా ఉన్న కంపెనీలను ఇతర రాష్ట్రాలకు తరిమేశారన్నారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తరువాత 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తున్నామన్నారు. పెద్ద ఎత్తున పెట్టుబడులు రాబడుతున్నాం, కంపెనీలు రావడం, యువతకు ఉద్యోగ అవకాశాలు రావడం చూసి మీరు తట్టుకోలేకపోతున్నారన్నారు. ఈనో వాడండి కాస్త రిలీఫ్ వస్తుందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+