తమ్ముడిని అలా చూడలేను: నారాయణ కుమార్తె ఆవేదనతో అంతా కంటతడి!
కుమార్తెలతో నిషిత్ కాళ్లకు మొక్కించి, అక్కడి నుంచి వారిని తీసుకెళ్లారు. అనంతరం అంతిమయాత్ర ప్రారంభమైంది.
నెల్లూరు: మంత్రి నారాయణ కుమారుడు నిషిత్ నారాయణ దుర్మరణం అతని కుటుంబాన్ని శోకసముద్రంలో ముంచెత్తింది. ఇంట్లో నిషితే చిన్నవాడు కావడంతో.. అతని పట్ల అందరికీ అమితమైన ప్రేమ ఉండేది. అలాంటి వ్యక్తి ఒక్కసారిగా తమకు దూరమవడంతో ఆ కుటుంబం తట్టుకోలేకపోతోంది.
ముఖ్యంగా నారాయణతో పాటు అతని కుమార్తె నిషిత్ మరణవార్త విని తీవ్ర షాక్ కు గురయ్యారు. తమ్ముడు విగతజీవిగా మిగిలిన దృశ్యాన్ని చూడలేనంటూ ఆమె బోరున విలపించారు. దీంతో అక్కడున్నవారంతా ఆమె ఆవేదన చూసి కంటతడి పెట్టుకున్నారు. మరో కుమార్తె సింధూ కూడా తమ్ముడిని అలా చూసి తట్టుకోలేకపోయింది.

అయితే జరగాల్సిన కార్యక్రమం ముందు ఉండటంతో.. కుమార్తెలతో నిషిత్ కాళ్లకు మొక్కించి, అక్కడి నుంచి వారిని తీసుకెళ్లారు. అనంతరం అంతిమయాత్ర ప్రారంభమైంది. నారాయణ కళాశాల నుంచి పెన్నా నది ఒడ్డున ఉన్న బోడిగాడి తోటలోని శ్మశానవాటిక వరకు ఎనిమిది కిలో మీటర్ల మేర ఈ అంతిమ యాత్ర సాగుతుంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, టిడిపి నేతలు ఇందులో పాల్గొననున్నారు.












Click it and Unblock the Notifications