25 వేల ఎకరాల భూమి: ఎపి రాజధానిపై నారాయణ

Narayana says Capital needs lot of land
రాజమండ్రి: భవిష్యత్తు అవసరాల దృష్ట్యా రాష్ట్ర రాజధానికి 25 వేల ఎకరాలు అవసరమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భావిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ చెప్పారు. మొత్తం 192 కార్యాలయాలకు చాలా స్థలం అవసరమని ఆయన అన్నారు. అందుబాటులో ఉన్న ప్రభుత్వ స్థలాలను పరిశీలిస్తున్నట్లు మంత్రి తెలిపారు.

ఆంధ్ర రాష్ట్ర రాజధానిని ఎక్కడ ఏర్పాటు చేయాలనే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఆయన అన్నారు. శివరామకృష్ణన్ కమిటీ ఇంకా కొన్ని జిల్లాల్లో పర్యటించాల్సి ఉందని ఆయన చెప్పారు. ఆగస్టు 20వ తేదీ లోపు శివరామకృష్ణన్ కమిటీ నివేదిక సమర్పిస్తుందని, ఆ తర్వాతే నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. రాజధాని సమదూరంలో ఉంటే బాగుంటుందని ఆయన అన్నారు.

ఉభయ గోదావరి జిల్లాల్లో విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నట్లు నారాయణ తెలిపారు. విజయనగరం జిల్లాలో గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. సచివాలయం ఉండే ప్రాంతంలోనే హైకోర్టును ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు.

కాగా, ఎంసెట్ కౌన్సెలింగ్‌పై తెలంగాణ ప్రభుత్వం రాజకీయం చేస్తోందని ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల మంత్రి గంటా శ్రీనివాస రావు అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎడ్యుకేషన్ హబ్‌గా మారుస్తామని చెప్పారు. వంద శాతం అక్షరాస్యత సాధించడం తమ లక్ష్యమని గంటా చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+