చంద్రబాబుది బ్రెయిన్‌లెస్ కమిటీ: నారాయణ
పెద్ద నోట్ల రద్దుపై అధ్యయనం చేసేందుకు ఏపీ సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం నియమించిన ముఖ్యమంత్రుల కమిటీ బ్రెయిన్‑లెస్ కమిటీ అని సీపీఐ నేత నారాయణ విమర్శించారు. గుంటూరులో శుక్రకవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రధాని మోదీపై మరోసారి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు ప్రపంచాన్ని గడగడలాడించిన జర్మనీ నియంత హిట్లర్ కూడా కరెన్సీని అవమానించలేదని కానీ, ప్రధాని మోదీ ఓ శాడిస్టులా దేశ ప్రజల మీద సర్జికల్ దాడులు చేస్తున్నాడన్నారు. హిట్లర్ నేరుగా ప్రజలను చంపితే మోదీ ప్రజలను మానసికంగా చంపుతున్నాడని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications