గుజరాత్ ఎగ్జిబిషన్: తెనాలిలో 'మోడీ మైనపువిగ్రహం'
గుంటూరు: ప్రధాని నరేంద్ర మోడీ మైనపు విగ్రహం గుంటూరు జిల్లాలో సిద్ధమైంది. జిల్లాలోని తెనాలికి చెందిన రవిచంద్ర అనే శిల్పి నరేంద్ర మోడీ విగ్రహాన్ని రూపొందించారు. ఈ నెల 24వ తేదీ నుండి 28వ తేదీ వరకు గుజరాత్‌లో జరగనున్న మెగా స్టీల్ ఈవెంట్, ఇండినాక్స్ ఎగ్జిబిషన్లో దీనిని ప్రదర్శించనున్నారు.

సుభాష్ చంద్రబోస్‌కు వెంకయ్య నివాళులు
విశాఖపట్టణంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి కేంద్రమంత్రి ఎం. వెంకయ్యనాయుడు పూలమాల వేసి నివాళులు అర్పించారు. నేతాజీని ఆదర్శంగా తీసుకోవాలని కోరిన వెంకయ్య అనంతరం ఏబీవీపీ ఆధ్వర్యంలో 2కే రన్‌ను ప్రారంభించారు.
గోదావరి పుష్కరాలపై సీఎస్ సమీక్ష
గోదావరి పుష్కరాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సీఎస్ కృష్ణారావు శుక్రవారం ఉదయం సమీక్ష సమావేశం నిర్వహించారు. దేవాదాయ శాఖ ముఖ్యకార్యదర్శి జేఎస్వీ ప్రసాద్, కమిషనర్ అనురాధ, గోదావరి జిల్లాల కలెక్టర్లు, అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు.












Click it and Unblock the Notifications