ఎన్ఈపీ అమలు చేసిన తొలి రాష్ట్రంగా ఏపీ- జగన్ సర్కార్ కు కస్తూరి రంగన్ ప్రశంసలు
గతేడాది అమల్లోకి వచ్చిన జాతీయ విద్యావిధానాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాల్సి ఉండగా.. కరోనా కారణంగా పలు రాష్ట్రాలు ఇంకా అమలు చేయలేదు. ఈ నేపథ్యంలో విద్యావిధానాన్ని అమలు చేసిన తొలి రాష్ట్రంగా ఏపీ పేరు తెచ్చుకుంది. దీంతో జాతీయ విద్యావిధానం 2020కు ఛైర్మన్ గా వ్యవహరించిన కస్తూరి రంగన్ ఇవాళ ఏపీ ప్రభుత్వంపై ప్రశంసల జల్లు కురిపించారు.
కరోనా సమయంలో విద్యావిధానం అమలు రాష్ట్రాలకు కష్టసాధ్యంగా మారిన పరిస్ధితుల్లో ఏపీ ప్రభుత్వం మాత్రం దీన్నో సవాల్ గా తీసుకుని అమలు చేసింది. దీంతో జాతీయ విద్యావిధానం అమలు చేసిన తొలి రాష్ట్రంగా ఏపీ రికార్డుల్లోకి ఎక్కింది. విద్యారంగ సంస్కరణల్లో భాగంగా ఏపీ ప్రభుత్వం దీన్ని అమలు చేసింది. దీనిపై ఇవాళ జరిగిన 11వ యూనివర్సిటీ డిస్టింగ్విష్డ్ లెక్చర్ కార్యక్రమంలో జాతీయ విద్యావిధానం 2020 ఛైర్మన్ డాక్టర్ కస్తూరి రంగన్ ప్రశంసలు కురిపించారు.

వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా జరిగిన ఈ కార్యక్రమంలో జాతీయ విద్యావిధానం 2020 చైర్మన్ డాక్టర్ కే. కస్తూరి రంగన్, తో పాటు విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ కూడా పాల్గొన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో జరుగుతున్న విద్యాసంస్కరణల్ని ఆయనకు విద్యామంత్రి సురేష్ వివరించారు. దీంతో రాష్ట్రంలో అమలవుతున్న విద్యా పధకాలపై ముఖ్యమంత్రి జగన్ ను, కస్తూరిరంగన్ ప్రశంసించారు. ఎన్ఈపి 2020 అమలులో మొదటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్.గుర్తింపు పొందిందని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో సమర్ధవంతంగా విద్యాసంస్కరణలు అమలవుతున్నాయన్నారు. కరోనా విపత్కర పరిస్థితుల్లోను నిధులు ఖర్చుకు వెనుకాడకుండా పలు విద్యాపధకాలు అమలు చేయడంపై కస్తూరి రంగన్ ఏపీ సర్కార్ ను అభినందించారు.












Click it and Unblock the Notifications