టీడీపీ గుర్తింపు రద్దుకు వైసీపీ-ఏపీలో రాష్ట్రపతి పాలనకు టీడీపీ- పార్టీల వ్యూహాలివే

ఏపీలో తాజాగా టీడీపీ నేత పట్టాభి వ్యాఖ్యల తర్వాత రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. పట్టాభి వ్యాఖ్యలకు నిరసనగా టీడీపీ ఆఫీసులపై వైసీపీ శ్రేణులు దాడులకు దిగగా.. వైసీపీ తీరుకు నిరసనగా రాష్ట్రంలో రాష్ట్రపతిపాలన విధించాలని టీడీపీ డిమాండ్ చేస్తోంది. తద్వారా ఇరు పార్టీలు ప్రత్యర్ధులదే తప్పని చెప్పేందుకు తహతహలాడుతున్నాయి. అదే సమయంలో ఇరు పార్టీలు మరో విషయంలో వ్యూహాత్మక అడుగులు వేస్తున్నాయి. జాతీయ స్ధాయిలో పార్టీల దృష్టిని ఆకర్షించేందుకు తమ డిమాండ్లకు పదునుపెడుతున్నాయి.

 వైసీపీ, టీడీపీ మధ్య గంజాయి చిచ్చు

వైసీపీ, టీడీపీ మధ్య గంజాయి చిచ్చు

రాష్ట్రంలో కొంతకాలంగా డ్రగ్స్ దందా పెరుగుతోందని వరుసగా విపక్ష టీడీపీ ఆరోపణలు చేస్తున్నా లైట్ తీసుకున్న వైసీపీ.. రాజకీయంగా తమకు నష్టం కలుగుతోందని ఆలస్యంగా గ్రహించింది. దీంతో వేగంగా అడుగులు వేయడం ప్రారంభించింది. అంతే విశాఖ మన్యంలో గంజాయికి సంబంధించి టీడీపీ నేతలు నక్కా ఆనందబాబు, పట్టాభి చేసిన వ్యాఖ్యలను సీరియస్ తీసుకోవడం మొదలుపెట్టింది,. ఇందులో భాగంగా నక్కా ఆనందబాబుకు నోటీసులు జారీ చేసి పోలీసులు విచారణ చేపట్టారు. దీంతో పట్టాభి తర్వాత తన వంతేనని భావించి రెచ్చిపోయారు. వైసీపీ సర్కార్ పై విమర్శలు చేసే క్రమంలో ఆయన మాటలు అదుపు తప్పడంతో రాజకీయంగా ఇరు పార్టీలకు ఇదో టర్నింగ్ పాయింట్ గా మారిపోయింది.

 టీడీపీ ఆఫీసులపై వైసీపీ దాడులు

టీడీపీ ఆఫీసులపై వైసీపీ దాడులు

సీఎం జగన్ పై పట్టాభి చేసిన వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకున్న వైసీపీ సర్కార్.. రాష్ట్రంలో టీడీపీ కార్యాలయాలపైకి తమ శ్రేణుల్ని పంపింది. దీంతో ఒక్కసారిగా పొలిటికల్ హీట్ పెరిగింది. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంతో పాటు రాష్ట్రంలో పలు చోట్ల టీడీపీ కార్యాలయాలపై వైసీపీ శ్రేణులు ఒక్కసారిగా విరుచుకుపడ్డాయి. దీంతో రాష్ట్రంలో భయానక పరిస్ధితులు నెలకొన్నాయి. సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తుంటే ఊరుకోవాలా అన్నది ఇక్కడ వైసీపీ ప్రశ్న. అయితే భౌతిక దాడులకు దిగుతారా అన్నది టీడీపీ ప్రశ్న. దీనికి వైసీపీ వద్ద సమాధానం లేదు. దీంతో కొత్త డిమాండ్లు తెరపైకి వచ్చేశాయి.

 రాష్ట్రపతి పాలనకు టీడీపీ డిమాండ్

రాష్ట్రపతి పాలనకు టీడీపీ డిమాండ్

పట్టాభి వ్యాఖ్యల కు నిరసనగా వైసీపీ శ్రేణులు టీడీపీ కార్యాలయాలపైకి దాడులకు దిగడంతో రాష్ట్రంలో శాంతి భద్రతలు గాడి తప్పాయని, అందుకే రాష్ట్రపతి పాలన విధించాలని టీడీపీ కేంద్రాన్ని కోరింది. ఈ మేరకు రాష్ట్రపతితో పాటు ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాకూ చంద్రబాబు లేఖలు కూడా రాశారు. రాష్ట్రంలో పరిస్ధితులు పూర్తిగా గాడి తప్పాయని, గతంలో ఎన్నడూ లేని విధంగా పార్టీ కార్యాలయాలతో పాటు నేతల ఇళ్లపై దాడులు జరుగుతున్నాయని, దీంతో రాష్ట్రపతి పాలన విధించదగిన పరిస్ధితులు ఉన్నాయని టీడీపీ చెబుతోంది.

 కౌంటర్ గా టీడీపీ గుర్తింపు రద్దు డిమాండ్

కౌంటర్ గా టీడీపీ గుర్తింపు రద్దు డిమాండ్

టీడీపీ ఎప్పుడైతే తమ కార్యాలయాలపై దాడుల్ని సాకుగా చూపుతూ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన కోరుతూ కేంద్రంలోని పెద్దలకు లేఖలు రాసిందో అప్పుడే వైసీపీ కూడా కౌంటర్ అటాక్ కు దిగింది. అసలు ఇలాంటి ఘటనలకు కారణమవుతున్న టీడీపీ గుర్తింపు రద్దు చేయాలని కేంద్రం ఎన్నికల సంఘానికి లేఖ రాస్తోంది. అదే సమయంలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి ఈ మేరకు విజ్ఞప్తి చేసేందుకు సిద్ధమవుతోంది. తద్వారా టీడీపీపై జాతీయ స్ధాయిలో ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది.

 జాతీయ స్ధాయిలో ఫోకస్ లక్ష్యంగా..

జాతీయ స్ధాయిలో ఫోకస్ లక్ష్యంగా..

టీడీపీ రాష్ట్రపతి పాలన డిమాండ్ చేయడం ద్వారా జాతీయ స్దాయిలో ఏపీలో ఏదో జరిగిపోతోందన్న అంశాన్ని తెరపైకి తెచ్చింది. దీంతో వైసీపీ కూడా టీడీపీ గుర్తింపు రద్దు కోరుతూ డిమాండ్లు చేస్తోంది. తద్వారా ఇరు పార్టీలు కూడా జాతీయస్ధాయిలో ఒకరికొకరు కౌంటర్లు ఇచ్చుకుంటున్నాయి. అదే సమయంలో జాతీయ స్ధాయిలో ప్రత్యర్ధుల డిమాండ్లకు చెక్ పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.. కౌంటర్ డిమాండ్ చేయకపోతే ప్రత్యర్ధుల డిమాండ్లు జాతీయ స్దాయిలో ఫోకస్ అవుతాయనే భయం ఇరుపార్టీల్లోనూ కనిపిస్తోంది. దీంతో రాష్ట్రపతి పాలనకు కౌంటర్ గానే వైసీపీ.. టీడీపీ గుర్తింపు రద్దుకు పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+