వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తుళ్లూరులో మహిళా కమిషన్‌ విచారణ: కన్నీటి పర్యంతం: పోలీసులపై ఫిర్యాదు..!

|
Google Oneindia TeluguNews

అమరావతి పరిధిలోని గ్రామాల మహిళలపైన పోలీసులు దాడులు చేస్తున్నారనే ఫిర్యాదు పైన జాతీయ మహిళా కమిషన్ విచారణ ప్రారంభించింది. కమిటీ సభ్యులను తొలుత గుంటూరులో టీడీపీ నేతలు కలిసి జరగుతున్న పరిణామాలను..ఫొటోలు..వీడియోలతో వివరించారు. ఆ తరువాత కమటీ సభ్యులు రాజధాని పరిధిలోని తుళ్లూరులో విచారణ ప్రారంభించారు. ముందుగా తుళ్లూరు తహసీల్దార్..డీఎస్పీతో కమిషన్ సభ్యులు సమావేశమై..క్షేత్ర స్థాయి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఆ తరువాత వారే రాజధాని ఉద్యమంలో మహిళలపై పోలీసుల దాడి ఘటనకు సంబంధించి క్షేత్ర స్థాయి పరిశీలన ప్రారంభించారు.

మహిళా కమిషన్ సభ్యుల విచారణ..
తమకు అందిన ఫిర్యాదుతో జాతీయ మహిళా కమిషన్ సభ్యులు తుళ్లూరు చేరుకున్నారు. మహిళలపై లాఠీ ఛార్జి, దాడి ఘటనలకు సంబంధించి తుళ్లూరు తహసీల్దార్‌, డీఎస్పీతో కమిషన్‌ సభ్యులు కాంచన కట్టర్‌, ప్రవీణ్‌ సింగ్‌ మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. తుళ్లూరు గ్రామానికి చేరుకునే ముందు మార్గ మధ్యంలో మహిళలపై దాడి జరిగిన ప్రదేశాన్ని వారు పరిశీలించారు. పోలీసుల నుంచి ఎదురవుతున్న ఇబ్బందులను మహిళా కమిషన్‌ సభ్యులకు వివరించేందుకు తుళ్లూరు మహిళలు భారీగా తరలివచ్చారు. పోలీసులు తమను ఏవిధంగా హింసించిందీ మహిళలు కమిషన్‌ ఎదుట ఏకరువు పెట్టారు. దాడి ఘటనకు సంబంధించి సెల్‌ఫోన్‌లో చిత్రీకరించిన కొన్ని దృశ్యాలను కమిషన్‌ సభ్యులకు చూపించారు.

National Women commission members visit Amaravati villages

అర్ద్రరాత్రి తమ నివాసాల్లోకి వస్తున్నారంటూ..
తాము రాజధాని కోసం భూములిచ్చామని..ఇప్పుడు రాజధాని తరలిస్తామంటే తాము ఆవేదనతో ఆందోళనకు దిగామని స్థానిక మహిళలు కమిషన్ సభ్యుల ముందు కన్నీటి పర్యంతమయ్యారు. ఆందోళన చేస్తున్న తమతో పోలీసులు దురుసుగా వ్యవహరిస్తున్నారని చెప్పుకొచ్చారు. ఉదయం పోలీస్ స్టేషన్ తీసుకెళ్లిన మహిళలను రాత్రి 9.00గంటలకు విడిచిపెట్టారని చెప్పుకొచ్చారు. అద్దరాత్రి 2గంటలకు సివిల్ డ్రసులో నివాసంలోకి వచ్చారని సిసి కెమెరాకు చిక్కిరాని స్థానిక మహిళలు ఫిర్యాదు చేసారు. మా ఊరి దేవస్థానాలకు తాళాలు వేశారని కావాలంటే స్వయంగా చూడవచ్చు అని మహిళలు వివరించారు. అయితే, ఆ తరువాత మహిళా కమిషన్ సభ్యులు మందడంలోనూ పర్యటించాలని భావించారు. కానీ, తుళ్లూరులో విచారణ పూర్తయిన వెంటనే విజయవాడకు వెళ్లిపోయారు.

English summary
National Women commission members visit Amaravati villages and took the information from ground level. Local women farmers complaint on Police attitude to wards them.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X