రెండు రాష్ట్రాలు, భిన్నంగా వేడుకలు: టీలో ధూంధాం, ఏపీలో సంకల్పం

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గన్ పార్కులో అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో డీజీపీ అనురాగ్ శర్మ, తెరాస నేతలు పాల్గొన్నారు.

మరోవైపు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడలో చంద్రబాబు నవ నిర్మాణ దీక్షకు సిద్ధమయ్యారు. ఇది తెలంగాణకు వ్యతిరేకం కాదని చెబుతున్నారు. ఏపీ అభివృద్ధే లక్ష్యంగా ఈ దీక్ష అని చెబుతున్నారు. బెంజ్ సర్కిల్ వద్ద నవ నిర్మాణ దీక్ష ఉంటుంది.

Nava Nirmana Deeksha in AP, Formation day celebrations in Telangana

తెలంగాణది సంబరం అయితే, ఏపీది సంకల్పం. మరోవైపు, ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ర్టాల ఉమ్మడి భవనంలో మంగళవారం రెండు తెలుగు రాష్ట్రాల ఆవిర్భావ కార్యక్రమాలు ఒకేసారి ఒకేచోట జరుగుతున్నాయి.

గురజాడ సమావేశ మందిరంలో ఉదయం 9.30 గంటలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్‌ రావు ఏపీ ఉద్యోగులు, ప్రజల చేత నవ నిర్మాణ దీక్ష ప్రతిజ్ఞ చేయించనున్నారు. అదే సమయానికి తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మహమూద్‌ అలీ అంబేద్కర్‌ విగ్రహం వద్ద జాతీయ జెండా ఎగురవేసి, తాత్కాలికంగా ఏర్పాటు చేసిన అమరవీరుల స్థూపాన్ని ఆవిష్కరించనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+