అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైజాగ్‌లో దీక్ష: రాజధాని లేకుండా, అప్పులు(ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: రాష్ట్ర విభజన జరిగి ఏడాదైన సందర్భంగా ప్రభుత్వ ఇచ్చిన ఆదేశాల మేరకు విశాఖలో నవ నిర్మాణ దీక్ష ఘనంగా జరిగింది. ఆంధ్రా యూనివర్శిటీ కాన్వొకేషన్ హాలులో జరిగిన సమావేశంలో నవ్యాంధ్ర నిర్మాణానికి ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు పిలుపునిచ్చారు.

ఆర్థిక పరిస్థితి బాగులేకపోయినా, అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్ళేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. తెలుగు ప్రజల మనోభావాలకు విరుద్ధంగా రాష్ర్ట విభజన చేయడంతోపాటు విభజన చట్టంలో కూడా ఆంధ్రప్రదేశ్‌కు తీరని అన్యాయం జరిగిందని ఆరోపించారు. నూతన రాష్ట్రానికి రాజధాని లేకుండా చేయడంతో పాటు భారీ అప్పులను అంటగట్టారని తెలిపారు.

మంత్రి గంటా మాట్లాడుతూ ఎన్నికల మేనిఫెస్టోయే తమకు పవిత్ర గ్రంథమని, ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసి తీరుతామని అన్నారు. ఇప్పటికే బెల్టుషాపులు రద్దు చేశామని, ఉద్యోగుల పదవీ విరమణ వయసు 60 ఏళ్లకు పెంచామని, రైతు రుణమాఫీ చేశామని, రేపటి నుంచి డ్వాక్రా రుణమాఫీ చేస్తున్నామన్నారు.

 త్వరలోనే హైదరాబాద్ నుంచి అమరావతికి రాజధాని

త్వరలోనే హైదరాబాద్ నుంచి అమరావతికి రాజధాని

విభజన జరిగి ఏడాది పూర్తయిన సందర్భంగా మంగళవారం స్థానిక గవర్నర్ బంగ్లా నుంచి ఏయూ వరకు నవ నిర్మాణ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఏయూ కాన్వొకేషన్ హాలులో జరిగిన సమావేశంలో సభికులతో నవ్యాంధ్ర నిర్మాణానికి ప్రతిజ్ఞ చేశారు.

 త్వరలోనే హైదరాబాద్ నుంచి అమరావతికి రాజధాని

త్వరలోనే హైదరాబాద్ నుంచి అమరావతికి రాజధాని

ఈ సందర్భంగా యనమల రామకృష్టుడు మాట్లాడుతూ రూ.16 వేల కోట్ల లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ ఏ వర్గానికి లోటు రానీయకుండా చేస్తున్నామన్నారు. అర్హులందరికీ రెండు లక్షల పింఛన్ల మంజూరుకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు.

త్వరలోనే హైదరాబాద్ నుంచి అమరావతికి రాజధాని

త్వరలోనే హైదరాబాద్ నుంచి అమరావతికి రాజధాని

ఆర్థిక పరిస్థితి బాగులేకపోయినా, అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్ళేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెద్ద ఎత్తున కల్పించి పేదరికాన్ని పారదోలేందుకు పెద్ద ఎత్తున పరిశ్రమల స్థాపనకు చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు.
 త్వరలోనే హైదరాబాద్ నుంచి అమరావతికి రాజధాని

త్వరలోనే హైదరాబాద్ నుంచి అమరావతికి రాజధాని

హైదరాబాద్ నుంచి అమరావతికి రాజధానిని త్వరలో తరలిస్తామన్నారు. రాష్ట్రానికి ఎంతో అన్యాయం చేసినప్పటికీ మొక్కవోని దీక్షతో అందరం సమష్టిగా శ్రమించి నవ్యాంధ్ర నిర్మించుకుందామన్నారు.

త్వరలోనే హైదరాబాద్ నుంచి అమరావతికి రాజధాని

త్వరలోనే హైదరాబాద్ నుంచి అమరావతికి రాజధాని

మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎన్నికల మేనిఫెస్టోయే తమకు పవిత్ర గ్రంథమని, ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసి తీరుతామన్నారు.

త్వరలోనే హైదరాబాద్ నుంచి అమరావతికి రాజధాని

త్వరలోనే హైదరాబాద్ నుంచి అమరావతికి రాజధాని

ఇప్పటికే బెల్టుషాపులు రద్దు చేశామని, ఉద్యోగుల పదవీ విరమణ వయసు 60 ఏళ్లకు పెంచామని, రైతు రుణమాఫీ చేశామని, రేపటి నుంచి డ్వాక్రా రుణమాఫీ చేస్తున్నామన్నారు.

త్వరలోనే హైదరాబాద్ నుంచి అమరావతికి రాజధాని

త్వరలోనే హైదరాబాద్ నుంచి అమరావతికి రాజధాని

నర్సీపట్నంలో మంత్రి అయ్యన్న పాత్రుడు, అనకాపల్లిలో ఎంపి అవంతి శ్రీనివాసరావు నవ నిర్మాణ దీక్షలు చేపట్టారు. అదే విధంగా శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో కూడా నవనిర్మాణ దీక్షలు ఘనంగా జరిగాయి.

 త్వరలోనే హైదరాబాద్ నుంచి అమరావతికి రాజధాని

త్వరలోనే హైదరాబాద్ నుంచి అమరావతికి రాజధాని

ప్రభుత్వాదేశాల మేరకు నిర్మాణ దీక్ష కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని కలెక్టర్ యువరాజ్ చెప్పారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్‌పర్సన్ లాలం భవాని, ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణబాబు, విష్ణుకుమార్‌రాజు, పోలీస్ కమిషనర్ అమిత్‌గార్గ్, జీవీఎంసీ కమిషనర్ ప్రవీణ్‌కుమార్ పాల్గొన్నారు.

English summary
The Nava Nirmana Deeksha will be organised in the city, municipalities, mandal headquarters and panchayats on Jane 2 and all officers and employees must participate in the programme, Collector N. Yuvaraj said here on Saturday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X