Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఆంధ్రప్రదేశ్ లో రైల్వే ప్రగతి రథచక్రాలు..!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శరవేగంగా పురోగతి వైపు దూసుకెళుతోంది. ముఖ్యంగా పలు నగరాలను, పట్టణాలను కలుపుతూ అనుసంధానం చేయబడ్డ రైల్వే లైన్లు, రహదారులతో ఏపీ ప్రగతి పథం వైపు వేగంగా అడుగులు వేస్తోంది. ఈ అభివృద్ధిలో భారతీయ రైల్వే కీలక పాత్ర పోషిస్తోంది. ప్రజల కలలను, ఆకాంక్షలను భారతీయ రైల్వే నిజం చేస్తూ వారి జీవన ప్రమాణాలను మెరుగుపరిచే విధంగా తన ప్రస్థానాన్ని సాగిస్తోంది.

విజయవాడ రైల్వే జంక్షన్
విజయవాడ రైల్వే జంక్షన్ భారతీయ రైల్వే ఏపీకి ఇచ్చిన బహుమతి . అందులో భాగంగా ఏపీలో రైల్వేకి అత్యంత ప్రాధాన్యతను ఇస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న విజయవాడ రైల్వే స్టేషన్ ను రైల్వే జంక్షన్ చేసింది భారతీయ రైల్వే. దేశంలోనే రద్దీగా ఉండే నాలుగో రైల్వేస్టేషన్‌గా విజయవాడ రైల్వే జంక్షన్ ఉంది. సుమారు 190 ఎక్స్‌ప్రెస్‌లు, 170 సరురు రవాణా రైళ్లతో పాటు 1.40 లక్షల మంది ప్రయాణికులకు సేవలను అందిస్తుంది.

Navigating Towards Progress Andhra Pradeshs railway evolution and Centers contributions

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే ఆయువుపట్టుగా రైల్వే
ఇది భారతీయ రైల్వే యొక్క ప్రధాన రైల్వే జంక్షన్లలో ఒకటి, జాతీయంగానూ అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రగతికి దోహదం చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అందమైన ప్రకృతి దృశ్యంలా రైల్వే తన నెట్వర్క్ ను ఆవిష్కరించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే ఆయువుపట్టుగా రైల్వే ఉంది అంటే అతిశయోక్తి కాదు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రజల కలలకు, ఆకాంక్షలకు, వారి జీవన ప్రమాణం మెరుగుదలకు రైల్వే ఎంతో దోహదపడుతుంది.

ఏపీకి అమృత్ భారత్ స్టేషన్ పథకం
ఏపీలో రైల్వే అభివృద్ధి చెంది, విస్తరణతో పాటు, ఆధునికీకరణకు సాక్ష్యంగా నిలిచింది. దేశంలో అమృత్ భారత్ స్టేషన్ పథకం భారతీయ రైల్వేలోని రైల్వేస్టేషన్ల అభివృద్ధి కోసం ప్రారంభించబడింది . ప్రస్తుతం ఈ పథకం ద్వారా 1275 రైల్వే స్టేషన్లను అభివృద్ధి పరచాలని నిర్ణయించింది. గుంటూరులోని 16స్టేషన్స్ తో కలుపుకుని, మొత్తంగా ఏపీలో 72స్టేషన్స్ ను అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద అభివృద్ధి చెయ్యడానికి ఎంపిక చేశారు.

కొత్త రైల్వే లైన్లు.. వేల కోట్ల బడ్జెట్
ఈ ఎంపిక చేసిన రైల్వే స్టేషన్లలో దశల వారీగా అభివృద్ధి పనులు పూర్తి చేయడం సహాఅధునాతన వసతులతో అందించడమే అమృత్ భారత్ స్టేషన్ పథకం లక్ష్యంగా పెట్టుకుంది. అదనంగా విశాఖపట్నంలో రూ.800 కోట్లతో కొత్త రైల్వే లైన్లు వేస్తున్నారు. నంద్యాల-యర్రగుంట్ల సెక్షన్.. నంద్యాల జిల్లాలోని నంద్యాలను మరియు కడప జిల్లా లోని యర్రగుంట్లని కలుపుతుంది. ఇది 2016 ఆగస్టు 23న ప్రారంభించబడింది. మొత్తం ప్రాజెక్ట్ రూ.967 కోట్లు వ్యయంతో పూర్తయింది.

Navigating Towards Progress Andhra Pradeshs railway evolution and Centers contributions

కృష్ణపట్నం ఓడరేవు-వెంకటాచలం-ఓబులవారిపల్లె రైల్వే లైన్ ప్రాజెక్ట్
దక్షిణ మధ్య రైల్వే సేవలందిస్తున్న ఓడరేవుల్లో కృష్ణపట్నం ఓడరేవు ఒకటి. ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణపట్నం ఓడరేవు-వెంకటాచలం-ఓబులవారిపల్లె కొత్త రైల్వే లైన్ ప్రాజెక్ట్. ఇది రెండు ప్రధాన రైలు మార్గాల మధ్య రైలు అనుసంధానాన్ని అందిస్తోంది.ఈ ప్రాజెక్టు వల్ల గుంతకల్ డివిజన్ నుంచి కృష్ణపట్నం వచ్చే రైళ్లకు 72 కిలోమీటర్ల దూరం తగ్గడంతో పాటు ఓబులవారిపల్లె-రేణిగుంట-గూడూరు సెక్షన్‌లో ట్రాఫిక్‌ రద్దీని తగ్గిస్తుంది.

కృష్ణపట్నం పోర్టు రైల్వే లైన్ ప్రాజెక్ట్ తో ఎన్నో ప్రయోజనాలు
కృష్ణపట్నం పోర్టు-వెంకటాచలం-ఓబులవారిపల్లి రైల్వే లైన్ విజయవాడ-గూడూరు-రేణిగుంట, గుంతకల్ సెక్షన్‌లలో ప్యాసింజర్, గూడ్స్ రైలు సర్వీసుల భారాన్ని తగ్గిస్తుంది. రైల్వే లైన్ పూర్తయిన తర్వాత సరుకు రవాణాలో గణనీయమైన వృద్ధిని ఆశించవచ్చు.ఈ మార్గంలో ప్రయాణీకుల సేవలు ప్రారంభమైన తర్వాత ఈ రైల్వే లైన్ ద్వారా వచ్చే ఆదాయం కూడా పెరుగుతుంది. ప్రస్తుతం కృష్ణపట్నం - వెంకటాచలం రైల్వే లైన్ సరుకు రవాణా వినియోగదారుల అవసరాలను తీరుస్తోంది.

Navigating Towards Progress Andhra Pradeshs railway evolution and Centers contributions

కృష్ణపట్నం పోర్టు రైల్వే లైన్లో అమృత్‌ భారత్ ఎక్స్ ప్రెస్ తో సహా మరిన్ని కొత్త రైళ్లు
సరుకు రవాణాను మెరుగుపరచడానికి, ప్రధాన లైన్లలో ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి, చెన్నై-ముంబై మార్గంలో గల ఓబులవారిపల్లి స్టేషన్ వరకు లైన్ మరింత పొడిగించబడింది. అమృత్‌ భారత్ ఎక్స్ ప్రెస్ తో సహా మరిన్ని కొత్త రైళ్లు సికింద్రాబాద్-విశాఖపట్నం, సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ లు.. విజయవాడ - చెన్నై వందే భారత్, అనంతపురం నుంచి న్యూఢిల్లీకి వెళ్లే కిసాన్ రైల్ ఎక్స్‌ప్రెస్, లాంటి రైళ్లను ప్రారంభించడంతో అనుసంధానం మరింత పెరుగుతుంది.

అమృత్ భారత్ రైళ్ళ ప్రత్యేకతలివే
అధునాతన సౌకర్యాలు అమృత్ భారత్ రైళ్ల సొంతం. మెరుగైన టాయిలెట్స్, సువాసన వెదజల్లే ఆటోమాటిక్ హైజీన్ ఆడర్ కంట్రోల్ సిస్టం, సాఫీ ప్రయాణానుభూతిని కల్పించే జెర్క్ ఫ్రీ సెమీ పెర్మనెంట్ కపులర్స్ ఏర్పాటు, టాయిలెట్లలో ఏరోసోల్ బేస్డ్ ఫైర్ సప్రెషన్ సిస్టమ్, ఎలక్ట్రికల్ క్యూబికెల్స్, పూర్తిగా సీల్ చేసిన గ్యాంగ్‌వేలు,రేడియంతో తళతళలాడే ఫ్రోర్లింగ్ స్ట్రిప్, ప్రయాణ సమయాన్ని తగ్గించే ఫాస్టర్ యాక్సిలరేషన్ ఈ రైలు సొంతం.

రాష్ట్ర ప్రగతితో పాటు ప్రజలకు ఉపాధి కల్పిస్తున్న రైల్వే ప్రాజెక్టులు
ఇటీవల, రూ. 12,343 కోట్ల అంచనా వ్యయంతో కేంద్ర ప్రభుత్వం ఆరు ప్రాజెక్టులకు 100% నిధులు మంజూరు చేసింది. 6 రాష్ట్రాల్లోని 18 జిల్లాలకు, రాజస్థాన్, అస్సాం, తెలంగాణ, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, నాగాలాండ్‌లను కవర్ చేసే ఆరు ప్రాజెక్టులు భారతీయ రైల్వేల ప్రస్తుత నెట్‌వర్క్‌ను 1020 కిలోమీటర్ల మేర పెంచనున్నాయి. ఈ ప్రాజెక్టులు ఆయా రాష్ట్రాల ప్రజలకు సుమారు మూడు కోట్ల పనిదినాల ఉపాధిని కల్పించనున్నాయి.

ఆత్మ నిర్భర్ భారత్ కోసం ప్రధాని మోడీ విజన్‌ ఇది
రైల్వేకు సంబంధించి బహుళ-ట్రాక్ ల ప్రతిపాదనలు కార్యకలాపాలను సులభతరం చేస్తాయి. రద్దీని తగ్గిస్తాయి, భారతీయ రైల్వేలలో అత్యంత రద్దీగా ఉండే విభాగాలలో అవసరమైన మౌలిక సదుపాయాల అభివృద్ధిని అందిస్తాయి. ఈ ప్రాజెక్టులు స్వయం ఉపాధి అవకాశాలను పెంపొందిస్తాయి . ఈ సమగ్ర అభివృద్ధి ప్రణాళిక ఆత్మ నిర్భర్ భారత్ కోసం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ విజన్‌కు అనుగుణంగా ఉంది.

ఏపీ ప్రగతికి, ఉపాధికి బాటలు వేస్తున్న రైల్వే
ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న ఈ కార్యక్రమాల వల్ల రైల్వే రద్దీ తగ్గి, మౌలిక సదుపాయాలు, ప్రయాణ మరియు రవాణా సౌకర్యాలు మెరుగుపడ్డాయి . లబ్దిదారులలో ప్రయాణీకులు మాత్రమే కాదు సరుకు రవాణా చేసే కస్టమర్లు కూడా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వ విజన్ వల్ల ఓవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రాంతీయ అభివృద్ధి, మరోవైపు ఉపాధి అవకాశాలు రెండూ మెరుగుపడ్డాయి. భారతదేశం స్వావలంబన దిశగా అడుగులు వేస్తోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+