నవ్యాంధ్ర ఛానల్ ఎండీ సునీల్, భార్య అరెస్ట్
నెల్లూరు: వివిధ రకాల దొంగతనాల కేసుల్లో ప్రధాన నేరస్థుడు, నవ్యాంధ్ర ఛానల్ ఎండీ సునీల్‌ను నెల్లూరు పోలీసులు అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించా రు. ఇటీవల ఈయన్ని ఒంగోలులో అదుపులోకి తీసుకున్న పోలీసులు చోరీల ఘటనలపై విచారించారు.
అతని వద్ద నుంచి కొంత సొమ్మును కూడా స్వాధీనం చేసుకున్నారు. అలాగే సునీల్ రెండవ భార్య నాగమణిని కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

బావిలో యువతి మృతదేహం
నెల్లూరు జిల్లాలోని సైదాపురం మండలం గిద్దలూరులోని పాడుబడిన బావిలో గుర్తుతెలియని యువతి(22) మృతదేహం లభ్యమైంది. హత్యగా అనుమానిస్తున్న పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు.
ప్రహారీ ఢీకొన్న స్కూల్ బస్సు: 10మందికి గాయాలు
ప్రకాశం జిల్లా దర్శిలోని ఎస్ఎస్‌పి కాలనీలో ఓ పాఠశాల బస్సు ఇంటి ప్రహారీ గోడను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 10మందికి గాయాలయ్యాయి. వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.
ఏసిబికి చిక్కిన వీఆర్వో
ఓ వీఆర్వో లంచం తీసుకుంటూ ఏసిబికి చిక్కిన ఘటన చిత్తూరు జిల్లా మదనపల్లి మండలం బాసినికొండ గ్రామంలో చోటు చేసుకుంది. ఓ వ్యక్తి వద్ద రూ. 10వేలు లంచం తీసుకుంటుండగా ఏసిబి అధికారులు దాడి చేసి వీఆర్వోను పట్టుకున్నారు. రూ. 10వేలు స్వాధీనం చేసుకొని, అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications