రిలీజ్ ది షిప్ - పవన్ కు కేంద్రం బిగ్ షాక్..!!

సీజ్ ది షిప్. దేశ వ్యాప్తంగా ట్రెండింగ్ అయింది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కాకినాడ పోర్టు లో ఇచ్చిన ఆదేశం. షిప్ సీజ్ చేయండి.. కేంద్రం తో నేను మాట్లాడుతాను అంటూ.. పవన్ నాడు పోర్టు లో చెప్పుకొచ్చారు. ఈ షిప్ లో బియ్యం ఎగుమతుల పైన అధికారిక లెక్కలు .. రాజకీయ విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వ సంస్థ నేషనల్‌ కో ఆపరేటివ్‌ ఎక్స్‌పోర్ట్స్‌ లిమిటెడ్‌ ఏపీకి కీలక సూచన చేసింది. షిప్ నిలిపివేత సరి కాదని తేల్చింది. పరోక్షంగా పవన్ కు కేంద్రం బిగ్ షాక్ ఇచ్చింది.

ఎన్సీఈఎల్ లేఖతో
కొద్ది రోజుల క్రితం కాకినాడ నుంచి ప్రజా పంపిణీకి వినియోగించే బియ్యం రవాణా పై డిప్యూటీ సీఎం పవన్ సీరియస్ అయ్యారు. నేరుగా సముద్రంలోకి వెళ్లి షిప్ లో రవాణా చేస్తున్న బియ్యం పై ఆరా తీసారు. ఆ రోజునే సీజ్ ది షిప్ అంటూ ఆదేశించారు. షిప్ ను చూడకుండా తనను అడ్డుకుం టున్నారని చెప్పుకొచ్చారు. తనను కాకినాడ పోర్టుకు రాకుండా ఒత్తిడి వచ్చిందని పేర్కొన్నారు. ఇక, పవన్ చేసిన సీజ్ ది షిప్ కామెంట్స్.. బియ్యం రవాణా అంశం రాజకీయంగా సంచలనంగా మారింది. ఈ వ్యవహారం పైన తాజాగా కాకినాడ జిల్లా కలెక్టర్ ప్రకటన చేసారు. ఏ మేర బియ్యం ఎగుమతుల పేరుతో తరలిస్తుందీ వివరించారు.

NCEL latest dirctions over Ship seize in Kakinada with Rice smuggling allegations

డీల్ పై ప్రభావం
పవన్ పర్యటన..వివాదం తరువాత ప్రభుత్వం బియ్యం ఎగుమతుల పైన నియమించిన సిట్ విచారణ మొదలు పెట్టింది. ఇక, ఇదే సమయంలో షిప్ సీజ్ చేసే అధికారం పైన భిన్నాభిప్రాయా లు వ్యక్తం అయ్యాయి. దీని పైన తాజాగా కేంద్ర ప్రభుత్వ సంస్థ నేషనల్‌ కో ఆపరేటివ్‌ ఎక్స్‌పోర్ట్స్‌ లిమిటెడ్‌ స్పందించింది. ఏపీ ప్రభుత్వానికి.. కాకినాడ కలెక్టర్ కు లేఖ రాసింది. అందులో ఆఫ్రికా తో ఒప్పందాలకు ఇబ్బంది తీసుకురావద్దని సూచించింది. తనిఖీల పేరిట ఆటంకాలతో దేశానికి ఇబ్బంది వస్తుందని పేర్కొంది. ఆకలి నివారణ కోసం ఆఫ్రికాతో జీటూజీ డీల్‌ చేసుకున్న విషయా న్ని గుర్తు చేసింది. కాకినాడ పోర్టు నుంచి నూక బియ్యం ఎగుమతులు జరుగుతాయని వాటి నిలిపివేతతో ఒప్పందానికి దెబ్బగా వివరించింది.

భారత్ - ఆఫ్రికా ఒప్పందం మేరకే
దీనికి కొనసాగింపుగా కాకినాడ పోర్టు నుంచి ఆఫ్రికా దేశాలకు ఎగుమతయ్యే నూకల విషయంలో అధికారులు తనిఖీల పేరుతో ఇక్కట్లు కలిగించవద్దని ఎన్సీఈఎల్ కోరింది. జీటూజీ ఒప్పందంలో భాగంగా కాకినాడ యాంకరేజ్‌ పోర్టు నుంచి ఆఫ్రికా దేశాలకు ఎన్‌సీఈఎల్‌ నూక బియ్యాన్ని ఎగు మతి చేస్తోందని ఆ సంస్థ సీఈవో అనుపమ్‌కౌశిక్‌ వివరించారు. ఇందులో ఫోర్టిఫైడ్‌ రైస్‌ ఆనవాళ్లు ఉన్నాయనే కారణంతో కొంతకాలంగా బియ్యాన్ని స్వాధీనం చేసుకోవడంతోపాటు ఎగుమతి చేయ కుండా కాకినాడ అధికారులు అడ్డుకోవడం సరికాదని లేఖలో ఎన్‌సీఈఎల్‌ తన లేఖలో పేర్కొంది. ఇదే విషయమై భారత విదేశీ వ్యవహారాలశాఖ తరచూ ఎన్‌సీఈఎల్‌కు మెయిల్స్‌, ఫోన్లు చేస్తూ ఎగుమతులు ఆగడంపై ప్రశ్నిస్తోందని ఆ లేఖలో ప్రస్తావించింది. కేంద్ర హోంశాఖ తోపాటు సహకార శాఖ పరిధిలో ఎన్‌సీఈఎల్‌ పనిచేస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+