ఏపీలో దారుణం: ఆడవాళ్లను అంగడి సరుకులా - ఆర్థిక నేరాల్లో టాప్ - ఎన్‌సీఆర్‌బీ రిపోర్టులో సంచలనాలు
దేశంలో వివిధ రకాల నేరాలకు సంబంధించి జాతీయ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో(ఎన్‌సీఆర్‌బీ) తాజాగా 2019 సంవత్సరానికి సంబంధించిన నివేదికను వెలువరించింది. అందులో ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి వెల్లడైన పలు సంచలన గణాంకాలు పరిస్థితి తీవ్రతను తెలియజేసేలా ఉన్నాయి. ఓవరాల్ గా నేరాల్లో ఏపీ దేశంలోనే ఎనిమిదో స్థానంలో నిలవగా.. కీలకమైన ఆర్థిక నేరాల్లో మాత్రం టాప్ లో ఉండటం, మహిళల అక్రమ రవాణాలో రెండో స్థానంలో నిలవడం కలకలం రేపుతున్నది.

2019 చివరి నాటికి ఇలా..
ఎన్‌సీఆర్‌బీ తాజా రిపోర్టులో 1995 నుంచి 2019 డిసెంబర్ చివరి నాటికి నమోదైన నేరాలను పరిగణలోకి తీసుకున్నారు. 2019 మేలో ఏపీలో జగన్ అధికారంలోకి రాగా, ఆ ఏడాది మొత్తంగా రాష్ట్రం ఆర్థిక నేరాల్లో అగ్రగామిగా నిలిచింది. గతేడాది ఏపీలో రూ.50 కోట్ల నుంచి 100కోట్లు మోసానికి పాల్పడిన కేసులు ఏకంగా 30 నమోదయ్యాయి. ఇది దేశంలోనే ఇది అత్యధికమని ఎన్‌సీఆర్‌బీ తెలిపింది. నమ్మకద్రోహం, ఫోర్జరీ, చీటింగ్, ఫ్రాడ్ తదితర మోసాలకు సంబంధించి నిందితులు, బాధితుల సంఖ్య ఏటా పెరుగుతూనే ఉంది.

జనాభా తక్కువే అయినా..
ఆర్థిక, పారిశ్రామిక వృద్ధిలో అగ్రరాజ్యాలైన మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, తమిళనాడును తోసిరాజని.. ఆంధ్రప్రదేశ్ లో ఆర్థిక నేరాలు విస్తృతంగా చోటుచేసుకుకోవడం గమనార్హం. మహారాష్ట్రతో పోల్చుకుంటే సగం జనాభా కూడా లేని ఏపీలో.. ప్రజలకు కుచ్చుటోపీ పెడుతోన్న నేరాలు ఎక్కువగా నమోదయ్యాయి. మధ్య తరగతి ప్రజలకు అత్యాశ చూపి మోసం చేస్తున్న వైనాలు భారీగా బయటపడ్డాయి. వాటిలో అగ్రిగోల్డ్ కేసు ప్రధానమైనది కాగా, డబ్బులు రెట్టింపు చేస్తామంటూ మోసాలకు పాల్పడిన ‘వెల్ పే' లాంటి సంస్థల పాత్ర కూడా ఉంది. రూ.50 కోట్ల నుంచి 100కోట్లు మోసం చేసిన కేసులు.. గతేడాది మహారాష్ట్రలో ఐదు మాత్రమే నమోదు కాగా, ఏపీలో వాటి సంఖ్య 30గా ఉండటం గమనార్హం. అదే సమయంలో...
Recommended Video

పెరిగిన మహిళల అక్రమరవాణా
ఎన్‌సీఆర్‌బీ నివేదిక ప్రకారం ఏపీలో మహిళలను అంగడి సరుకులుగా విక్రయించే ముఠాల కార్యకలాపాలు పెరిగాయి. మహిళల అక్రమ రవాణా, విక్రయాల్లో మహారాష్ట్ర టాప్ లో ఉండగా, అక్కడి గ్యాంగుల కార్యకలాపాలు ఏపీకి సైతం విస్తరించినట్లు నివేదికలో వెల్లడైంది. ఏపీలో మూడేళ్లుగా మానవ అక్రమ రవాణా క్రమంగా పెరుగుతూ, 2019లో దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది. మహిళలు, మానవ అక్రమ రవాణాలో మహారాష్ట్ర 12.5శాతంతో అగ్రస్థానంలో ఉండగా 10.8శాతంతో ఏపీ తర్వాతి స్థానంలో ఉంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి 398మంది మహిళలు, యువతులు గతేడాది అక్రమ రవాణాకు గురికాగా వారిలో 316మంది వ్యభిచార గృహాలకు అమ్ముడు పోయారని, వీటికి సంబంధించి కేసుల నిరూపణ శాతం తక్కువగా ఉందని, కేవలం 21.8 శాతం కేసుల్లోనే శిక్షలు పడ్డాయని ఎన్‌సీఆర్‌బీ వెల్లడించింది.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications