వైసీపీ టార్గెట్ గా చంద్రబాబు మరో కీలక నిర్ణయం..! ఇక చుక్కలే...
ఏపీలో సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయంతో ఇవాళ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఎన్నికల ప్రచారంలో భాగంగా గత ఐదేళ్ల వైసీపీ పాలనపై ఇరువురు నేతలు నిప్పులు చెరిగారు. ముఖ్యంగా వైసీపీ పాలనలో జరిగిన విధ్వంసాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి ఓట్లు అడిగారు. ప్రజలు కూడా దీనికి సానుకూలంగా స్పందించి వీరికి ఓటేశారు. దీంతో ఇప్పుడు చంద్రబాబు మరో అడుగు వేయబోతున్నారు.
గత వైసీపీ పాలనలో రాష్ట్రంలో జరిగిన విధ్వంసాలపై ఇక శ్వేతపత్రాలు విడుదల చేయాలని చంద్రబాబు నిర్ణయించారు. ఈ మేరకు శాఖల వారీగా శ్వేతపత్రాల విడుదల కోసం రిపోర్టులు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. ప్రతీ శాఖలోనూ వైసీపీ పాలన వల్ల కలిగిన నష్టాన్ని అంకెలతో ఈ శ్వేతపత్రాలు ఉండబోతున్నాయి. వీటిని జనంలోకి తీసుకెళ్లి వాస్తవాలు వివరించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఆర్ధిక వ్యవహారాలతో పాటు ఇసుక, మద్యం వంటి అంశాల్లో వైసీపీ ప్రభుత్వం తీవ్ర అక్రమాలకు పాల్పడిందని టీడీపీ, జనసేన ఎప్పటి నుంచో ఆరోపిస్తున్నాయి. ముఖ్యంగా భారీ ఎత్తున అప్పులు తీసుకురావడం, సర్పంచ్ లకు ఇవ్వాల్సిన ఆర్ధిక సంఘం నిధుల్ని పథకాలకు మళ్లించేయడం, ముఖ్యమైన శాఖల్లో కేటాయింపులు తగ్గించేయడం వంటి చర్యల ద్వారా వైసీపీ సర్కార్ విధ్వంసానికి పాల్పడినట్లు కూటమి నేతలు భావిస్తున్నారు. దీంతో పాటు అమరావతికి కూడా వైసీపీ ప్రభుత్వం చేసిన అన్యాయాన్ని సైతం లెక్కలతో సహా శ్వేతపత్రాల్లో వివరించేందుకు సిద్దమవుతున్నారు.












Click it and Unblock the Notifications