మళ్లీ అలిగిన వేమిరెడ్డి- గతంలో జగన్ ను ముంచేసిన చరిత్ర..!
ఏపీలో రాజకీయమంతా ఓ ఎత్తు. నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాజకీయం ఓ ఎత్తు. ఎందుకంటే సొంత పార్టీ ప్రభుత్వం నడుపుతున్నా దాని కంటే ఆయన సొంత ఇగోకే ఎక్కువ ఆయన ప్రాధాన్యమిస్తుంటారు. అలా అని బహిరంగ విమర్శలు చేయరు. కామ్ లా అలుగుతారు. అంతే కామ్ గా తాను చేయాల్సింది చేసేస్తారు. చివరకు వారి బాధితులు మాత్రమే దాని గురించి మాట్లాడుకునే పరిస్ధితి కల్పిస్తారు. ఇదంతా ఎందుకంటే వేమిరెడ్డి మళ్లీ అలిగారు.
నెల్లూరు నగరంలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జిల్లా సమీక్షా మండలి సమావేశంలో కార్యక్రమ వ్యాఖ్యాతగా వ్యవహరించిన రూరల్ ఆర్డీవో ప్రత్యూష అక్కడికి వచ్చిన వారి పేర్లన్నీ చదివి ఎంపీ వేమిరెడ్డి పేరును మాత్రం విస్మరించారు. దీంతో ఆయన తన భార్య, కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిని తీసుకుని వేదికపై నుంచి అలిగి వెళ్లిపోయారు. దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కూడా అదే వేదికపై ఉన్నారు. వేమిరెడ్డి హఠాత్తుగా లేచి వెళ్లిపోతుండటంతో ఆయన కారు వరకు వెళ్ళి మంత్రి గారు సముదాయించేందుకు ప్రయత్నించారు. అయినా ఫలితం లేదు.

ఎంపీ వేమిరెడ్డి కారులో కూర్చుని డోర్ వేసేసుకున్నారు. వెంటనే అక్కడికి వచ్చిన సీనియర్ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఆయన్ను బతిమాలడం మొదలుపెట్టారు. అయినా వేమిరెడ్డి వెనక్కి తగ్గలేదు. స్టేజ్ పై ఎంపీ అయిన తనకు గౌరవం ఇవ్వరా అని ప్రశ్నించారు. మంత్రి ఆనం ఏదో చెప్పబోతే పట్టించుకోకుండా అలాగే బయలుదేరి వెళ్లిపోయారు. చివరికి వేమిరెడ్డి విషయంలో అధికారుల తీరును తప్పు పట్టిన మంత్రి ఆనం, మరోసారి ఇలా జరగకుండా చూడాలని అధికారుల్ని ఆదేశించారు.
ఇంతకీ అసలు వేమిరెడ్డి అలక గురించి ఎందుకింత చర్చా అంటే.. ఆయన ఫ్లాష్ బ్యాక్ అలాంటిది మరి. గత వైసీపీ ప్రభుత్వంలో జగన్ తో అత్యంత సన్నిహితంగా మెలిగిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ప్రత్యేక స్ధానం ఉండేది. గతంలో వైసీపీ విజయాల కోసం భారీగా డబ్బు ఖర్చుపెట్టి నెల్లూరును ఆ పార్టీ కంచుకోటగా మార్చిన వారిలో వేమిరెడ్డి అగ్రస్థానంలో ఉంటారు.
ఏదో చిన్న కారణాలతో జగన్ పై అలిగి YSRCP నుంచి వెళ్లి ఏం సాధించారు లేని అవమానాలు ఎదుర్కొంటున్నారు
— Kumar Reddy.Avula (@Kumar991957) November 3, 2024
నిన్న బాలినేని ఈరోజు వేమిరెడ్డి
pic.twitter.com/BQxjW1WEQ6
కానీ తన భార్య ప్రశాంతి రెడ్డికి టికెట్ అడిగితే జగన్ ఏవేవో సాకులు చెప్పి పట్టించుకోలేదు. అంతే కాదు వేమిరెడ్డిని గత ఎన్నికల్లో ఎంపీ అభ్యర్ధిగా ప్రకటించినా ఆయన పరిధిలో ఉండే నెల్లూరు సిటీ స్ధానంలో ఓ జూనియర్ నేతకు టికెట్ ఇచ్చేశారు. దీంతో అలిగిన వేమిరెడ్డి వైసీపీని వీడి టీడీపీలోకి వెళ్లి అదే నెల్లూరు ఎంపీగా గెలవడంతో పాటు తన భార్యను కోవూరులో గెలిపించుకున్నారు. దీంతో వేమిరెడ్డి అలక చరిత్ర తెలిసిన వారెవరూ ఆయనతో పెట్టుకోరని అభిమానులు చెప్తుంటారు.
-
జగన్ బిగ్ ప్లాన్, 2019 కాంబో రిపీట్ - మారుతున్న లెక్కలు..!! -
పంచె కట్టులో మెరిసిన జగన్, సతీ సమేతంగా ఉగాది వేడుకలు -
ప్రపంచంలో సంతోషకరమైన దేశం ఇదే.. మారిన లెక్కలు.. -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications