మంత్రి అనిల్ సమర్ధతకు సవాల్ : పార్టీలో వర్గ పోరు - అటు పార్టీల పొత్తులు : టార్గెట్ వైసీపీ..!!
నెల్లూరు మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికలకు నామినేషన్ల సమయం ముగుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన 14 మున్సిపల్ కార్పోరేషన్లు వైసీపీ గెలిచుకుంది. నెల్లూరు జిల్లాలోనూ వైసీపీ జెండా ఎగురవేయటానికి ప్రయత్నాలు చేస్తోంది. ఇదే సమయంలో పొత్తుల లెక్కలు కొత్త సమీకరణాలకు తెర తీస్తున్నాయి. నగరంలోని 54 డివిజన్లలో వైసీపీ అభ్యర్ధులు నామినేషన్లు ఈ రోజుతో పూర్తి కానున్నాయి. అధికారికంగా టీడీపీ - సీపీఎం పొత్తుతో రంగంలోకి దిగుతున్నాయి. అదే విధంగా బీజేపీ - జనసేన సైతం పోటీ చేసే వార్డుల మీద తర్జన భర్జన పడుతున్నాయి. ఈ నాలుగు పార్టీల లక్ష్యం వైసీపీ గా మారింది.

వైసీపీ టార్గెట్ గా క్షేత్ర స్థాయి రాజకీయాలు
ఇందు కోసం నాలుగు పార్టీల నేతలు క్షేత్ర స్థాయిలో వైసీపీని ఓడించటమే లక్ష్యంగా పని చేయటం ఖాయంగా కనిపిస్తోంది. అయితే నెల్లూరు తమకు బలం ఉందని జనసేన లెక్కలు వేస్తోంది. దీంతో...ఏకంగా తమకు 54 డివిజన్లలో 40 స్థానాలు కేటాయించాలని డిమాండ్ చేస్తోంది. బీజేపీ అందుకు ససేమిరా అంటోంది. చెరి సగం పోటీ చేద్దామని ప్రతిపాదిస్తోంది. ఈ రోజున ఆశావాహులు అంతా నామినేషన్లు దాఖలు చేసినా..ఉపసంహరణ సమయంలోగా అధికారికంగా ఎవరు పోటీలో ఉండాలనేది తేల్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. టీడీపీ, సీపీఎంల మధ్య ఇప్పటికీ చర్చలు కొనసాగుతున్నాయి.

మంత్రి అనిల్ కు పరీక్షగా..
నెల్లూరు లో 2014 లో ఎనిమిది స్థానాలు.. 2019 లో పదికి పది స్థానాలు వైసీపీ గెలుచుకుంది. ప్రస్తుతం నెల్లూరులో వైసీపీ నేతల మధ్య ఆధిపత్య పోరు కనిపిస్తోంది. అదే సమయంలో ప్రతిపక్ష పార్టీలు వైసీపీని ఓడించేందుకు ఏకం అవుతున్నాయి. బీజేపీతో కలవటానికి సీపీఎం సిద్దంగా లేదు. కానీ, కొద్ది నెలల క్రితం జరిగిన ఎన్నికల్లో క్షేత్ర స్థాయిలో టీడీపీ- జనసేన- బీజేపీ పరస్పరం సహకరించుకున్నాయి. వైసీపీ లక్ష్యంగా పని చేసాయి. ఇక, నెల్లూరు నగరం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి..మంత్రిగా ఉన్న అనిల్ కుమార్ యాదవ్ కు ఈ ఎన్నికలు పరీక్షగా మారుతున్నాయి.

నేతలు పూర్తిగా సహకరించేనా
అసెంబ్లీ లోపలా..బయటా పార్టీ వాయిస్.. బలంగా వినిపించే మంత్రి అనిల్ ఈ ఎన్నికల్లో గెలుపు బాధ్యతలు తీసుకున్నారు. ఇప్పటికే పార్టీ సమన్వయకర్త సజ్జల రామక్రిష్ణారెడ్డి సైతం నెల్లూరులో పర్యటించి నేతలు సమన్వయంతో పని చేయాలని స్పష్టం చేసారు. కొంత కాలంగా నెల్లూర అధికార పార్టీలో నేతల మధ్య వర్గ పోరు సాగుతోంది. బయట పడకపోయినా..లోలోపల మాత్రం కోల్డ్ వార్ కంటిన్యూ అవుతోంది. నగరానికి సరిహద్దుగా ఉన్న నియోజకవర్గాల ఎమ్మెల్యేలుతో సత్సంబందాలు కనిపించటం లేదు.

గెలుపు కాదు.. ఎన్ని సీట్లనదే ఇప్పుడు కీలకంగా
తాజాగా తెలుగుదేశం పార్టీ ముఖ్య నేత మున్వర్ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇప్పడు ఈ ఎన్నికలు మొత్తం మంత్రి అనిల్ చుట్టూ తిరుగుతున్నాయి. నెల్లూరు నగరంలో గత ఎన్నికల్లొ టీడీపీ నుంచి పోటీ చేసిన మాజీ మంత్రి నారాయణ అధికారికంగా సీన్ లోకి రావటం లేదు. టీడీపీ నేతల్లో ఇప్పుడు అక్కడ జోష్ నింపే ప్రధాన నేతలు కరువయ్యారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. దీంతో.. స్థానికంగా అవకాశం ఉన్న చోట అంతర్గత ఒప్పందలాలతో ముందుకెళ్లేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి.

కలిసి వస్తారా... సత్తా చాటుతారా
నెల్లూరు నగరంలో పెన్షన్లు దరఖాస్తు చేసిన వారు ఉన్నారని..ఎన్నికలు వస్తుండటంతో వాటిని మంజూరు చేయాలంటూ తాజాగా మంత్రి అనిల్ నేరుగా సీఎం ను కోరారు. అయితే, ప్రతీ ఏటా రెండు సార్లు కొత్తగా వచ్చిన దరఖాస్తులను ఆమోదించాలనేది పాలసీ నిర్ణయమని..అదే విషయం దరఖాస్తు దారులకు చెప్పాలని సీఎం సూచించారు. ఇప్పటి వరకు వైసీపీ నేతలు కార్పోరేషన్ దక్కించుకోవటం పైన ధీమాగానే కనిపిస్తున్నారు. అయితే, ప్రతిపక్షాలను ఎన్ని సీట్లకు పరిమితం చేస్తారనేది ఇప్పుడు అనిల్ సమర్ధతకు సవాల్ గా మారుతోంది.
-
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక












Click it and Unblock the Notifications