Nellore: రాంగ్ రూట్లో కారును ఢీకొట్టిన టిప్పర్-నెల్లూరు జిల్లాలో ఏడుగురు బలి..!

నెల్లూరు జిల్లాలో ఇవాళ ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మితి మీరిన వేగంతో ఓ ఇసుక టిప్పర్ రాంగ్ రూట్లో వచ్చి మరీ రోడ్డుపై కారును ఢీకొన్న ఘటనలో ఏడుగురు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. నెల్లూరు నుంచి ఆత్మకూరు వైపు రెండు కుటుంబాలకు చెందిన ఏడుగురు కారులో వెళ్తున్నారు. అదే సమయంలో ఇసుక లోడుతో రాంగ్ రూట్లో మితిమీరిన వేగంతో వచ్చిన టిప్పర్ ఈ కారును ఢీకొట్టింది. కారును ఢీ కొట్టి కొంత దూరం ఈడ్చుకెళ్లింది. దీంతో కారు నుజ్జు నుజ్జు అయింది.

నెల్లూరు జిల్లా సంగం మండలం పెరమన జాతీయ రహదారిపై ఈ ఘటన చోటు చేసుకుంది. టిప్పర్ ఢీకొన్న ఘటనలో కారులోనే ఉండి చనిపోయిన వారి మృతదేహాల్ని వెలికి తీసేందుకు పోలీసుల తీవ్రంగా శ్రమిస్తున్నారు. ముంబై జాతీయ రహదారిగా పిలుచుకునే ఈ రోడ్డులో తరచుగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నా, వందలాది ప్రాణాలు గాల్లో కలుస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి.

Nellore Road Tragedy 7 Killed as Tipper Rams Car on Wrong Route

మరోవైపు నెల్లూరు జిల్లా సంగం మండలం పెరమన వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. టిప్పర్ కారు ఢీకొన్న ఘటనలో ఆరుగురు మృతి చెందడంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు అండగా ఉండాలని అధికారుల్ని ఆదేశించారు. ప్రమాదంపై విచారించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు.

Nellore Road Tragedy 7 Killed as Tipper Rams Car on Wrong Route

అటు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఈ ప్రమాదంపై తీవ్రంగా స్పందించారు. క్షతగాత్రులకు అత్యవసర వైద్యం అందించాలంటూ ఆదేశాలు ఇవ్వడంతో పాటు భద్రత చర్యలు చేపట్టాలని రవాణా అధికారులకు సూచనలు చేశారు. నిర్లక్ష్యంగా ఉంటే సహించమని వారిని హెచ్చరించారు. సహాయక చర్యలు తీసుకోవాలని ఫోన్లో ఆదేశించాలు ఇచ్చారు. రహదారులపై నియమాల అమలు తప్పనిసరి చేయాలని అధికారులకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ కూడా నెల్లూరు ప్రమాదం అత్యంత విషాదకరమని పేర్కొన్నారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఇటువంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+