Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

జనసేనలో మరో వికెట్ డౌన్..పవన్‌కు షాకిచ్చిన కీలక నేత

టికెట్ల పంచాయితీ కూటమిలో ప్రకంపనలు సృష్టిస్తోంది. మూడు పార్టీలోనూ దాదాపు ఇదే పరిస్థితి కనిపిస్తోంది. పార్టీల్లో అసమ్మతి ఒక్కసారిగా బయటపడింది. ముఖ్యంగా జనసేన పార్టీలో అసమ్మతి కాస్తా ఎక్కువగా కనిపిస్తోంది. జనసేన పార్టీలో టికెట్ దక్కని నేతలు బహిరంగంగానే తమ ఆక్రోశాన్ని వెళ్ళగక్కుతున్నారు. జనసేనలో టికెట్ దక్కని నేతలు ఒక్కొక్కరు ఆ పార్టీని వీడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. పవన్ వ్యవహారశైలిపై తీవ్ర విమర్శలు చేస్తూ జనసేన నాయకులు పార్టీ నుంచి బయటకు వచ్చేస్తున్నారు.

పార్టీలో మొదటి నుంచి ఉన్న నాయకులకు సైతం టికెట్ దక్కడం లేదు. 40 ఎమ్మెల్యే సీట్లు ఆశించిన జనసేన కార్యకర్తలకు భంగపాటు తప్పలేదు. కేవలం 21 స్థానాల్లో మాత్రమే జనసేన పోటీ చేయడంపై ఆ పార్టీ కార్యకర్తలు తమ అసంతృప్తిని బహిరంగంగానే వ్యక్తం చేశారు. ఈ 21 స్థానాల్లో కూడా వేరే పార్టీల నుంచి వారికి టికెట్లు కేటాయించడంపై జనసేనలో తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. జనసేన పార్టీలో టికెట్ దక్కని నేతలు బహిరంగంగానే తమ ఆక్రోశాన్ని వెళ్ళగక్కుతున్నారు. పవన్ వ్యవహారశైలిపై తీవ్ర విమర్శలు చేస్తూ జనసేన నాయకులు పార్టీకి రాజీనామా చేస్తున్నారు.

Nellore Rural Constituency In-charge Manukranth Chennareddy resignation from Janasena

అనకాపల్లి నియోజకవర్గ ఇంచార్జ్‌ పరుచూరి భాస్కరరావు, మామ్మిడివరం నియోజకవర్గం ఇంచార్జ్‌ పితాని బాలకృష్ణ ,విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఇంచార్జ్‌ పోతిన మహేష్, పాముల రాజేశ్వరి వంటి నేతలు జనసేనకు రాజీనామా చేయగా, తాజగా మరో కీలక నేత ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఇంఛార్జ్ మనుక్రాంత్ జనసేనకు రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.

''వ్యక్తిగత కారణాల వల్ల జనసేన పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్ష పదవికి, జనసేన పార్టీ సభ్యత్వంతో పాటు నాకు కేటాయించిన అన్ని పదవులకు రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నాను. నేను పార్టీలో ఉన్నంత కాలం నిస్సందేహంగా విధేయుడిగా ఉన్నానని, గత 6 సంవత్సరాలుగా పార్టీకి అండగా ఉంటూ జనసేన పార్టీ నిర్మాణానికి ఎంతో కృషి చేశానని అందరికీ తెలుసు. ఇన్నాళ్లూ నాకు అండగా నిలిచిన మీ అందరికి మరియు జనసేన పార్టీ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.

నా నిర్ణయం ఎవరికైనా ఏదైనా అసౌకర్యాన్ని కలిగిస్తే దయచేసి నా క్షమాపణలను అంగీకరించండి. ప్రతి ఒక్కరూ నా నిర్ణయాన్ని గౌరవిస్తారని ఆశిస్తున్నాను'' అంటూ తన లేఖలో రాసుకొచ్చారు. అయితే ఆయన పవన్ కల్యాణ్ వ్యవహారశైలి నచ్చకనే జనసేన నుంచి బయటకు వచ్చినట్టు తెలుస్తోంది. మనుక్రాంత్ త్వరలోనే జగన్ సమక్షంలో వైసీపీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+