వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబుగారి లీకులపై సోషల్ మీడియాలో సెటైర్లు...లేటెస్ట్ టాపిక్ ఏంటంటే!

|
Google Oneindia TeluguNews

అమరావతి:కేంద్రానికి రాష్ట్రానికి మధ్య జరుగుతున్న నిస్వార్థ పోరాటంలో విపక్షాలు ఎటు వైపో తేల్చిచెప్పాలట! ఇదీ చంద్రబాబు గారి అనుకూల పత్రికలో వచ్చిన తాజా లీకని...దీనికి సమాధానం ఆ పార్టీలు చెప్పే ముందు...తమకు చంద్రబాబో ఆ పత్రికో క్లారిటి ఇవ్వాలని...దాంతో పాటు బాండ్ పేపర్ మీద హామీ కూడా ఇవ్వాలని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.

ఈ విషయమై చంద్రబాబు నుంచి ముందు తమకు సమాధానాలు కావాలని నెటిజన్లు కోరుతున్నారు. ఇప్పుడు కేంద్రం మీద నిప్పులు కురిపిస్తున్న చంద్రబాబు అదే మాట మీద ఉంటారా?...ఉంటే ఎప్పటిదాకా ఉంటారు...ఎందుకంటే ఇంత పోరాటం ప్రకటించాక కూడా మళ్లీ మొన్న జైట్లీతో సుజనా సమావేశం...యనమల ప్రశ్నించడం గురించి మళ్లీ లీకుల నేపథ్యంలో మిమ్మల్సి అస్సలు నమ్మదలుచుకోలేదని నెటిజన్లు అపనమ్మకం ప్రకటిస్తున్నారు.

 చంద్రబాబు వీరంగంపై...ప్రతి రోజూ లీకులు...

చంద్రబాబు వీరంగంపై...ప్రతి రోజూ లీకులు...

చంద్రబాబు గారు మరోసారి కేంద్రం మీద నిప్పులు చెరిగారని...ఆగ్రహంతో మండిపడ్డారని...అలాగే విపక్షాలను భీభత్సంగా నిలదీసారని... ఏమనంటే?...నేను కేంద్రం మీద నిస్వార్థంగా ఇంతటి పోరాటం చేస్తుంటే...మీరు సైలెంట్ గా ఎలా ఉంటారంటూ నిగ్గదీసి అడిగారని...బాబుగారి ఈ ఆవేశానికి ఎవరైనా వెంటనే స్పందించకుంటే పరిస్థితి మాడి మసైపోయేట్లు ఉందని...ఇదంతా ఒక చోట జరిగిందని...అదెక్కడంటే?

కలలో...కాదు...టెలీ కాన్ఫరెన్స్ లో

కలలో...కాదు...టెలీ కాన్ఫరెన్స్ లో

కలలో కాదంట!...టెలీ కాన్ఫరెన్స్ లో...అని...ఒక పత్రిక ఎవరికీ తెలియని వార్తలు...అవే నండి లీకులు...ఈ మధ్య రోజూ చంద్రబాబు గారి టెలీ కాన్ఫరెన్స్ గురించి పుంఖానుపుంఖానులుగా బ్యానర్ వార్తలుగా రాస్తోందంటూ నెటిజన్లు వ్యంగాస్త్రాలు సంధిస్తున్నారు. అసలు ఆ టెలీ కాన్ఫరెన్స్ లో అలా జరిగిందో లేదో కానీ మీరు మాత్రం భలే రాస్తారంటూ సెటైర్లు వేస్తున్నారు...బాబు గారి అంతటి వీరావేశాన్ని చూసే అత్యంత అరుదైన దృశ్యాలను చూసే అదృష్టం మీకు మాత్రమే దక్కుతోందంటూ ఎద్దేవా చేస్తున్నారు.

ఈసారి తాజా లీక్...ఇదేనట!

ఈసారి తాజా లీక్...ఇదేనట!

ఆ పత్రిక కథనం ప్రకారం ఈసారి తాజా లీక్...కేంద్రానికి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న ఈ అరివీర భయంకరమైన పోరాటంలో రాష్ట్రంలోని మిగిలిన రాజకీయ పార్టీలు ఎటువైపో తేల్చి చెప్పాలట...అయితే ఈ విషయాన్ని టెలీ కాన్ఫరెన్స్ లో కాకుండా ఏ బహిరంగ వేదిక మీదో ఇంతే తీవ్రంగా ప్రశ్నించివుంటే బాగుండేదని అంటున్నారు.

దీనిపై నెటిజన్లు...ఏమంటున్నారంటే!

దీనిపై నెటిజన్లు...ఏమంటున్నారంటే!

ఈ పోరాటంలో రాష్ట్రానికి చెందిన మిగతా పార్టీలు ఎటువైపు ఉన్నాయో మీకు ప్రధానం కానీ...మాకు మాత్రం...ముందు మీరు ఎటు వైపు ఉన్నారు?...ఇదే వైఖరితో ఎంతకాలం ఉంటారు?...మళ్లీ మీ వైఖరి మార్చుకోరని గ్యారెంటీ ఏంటి?...అందుకే నా వైఖరి వచ్చే ఎన్నికలు పూర్తయేవరకు ఇదే అని...బాండ్ పేపర్ పై రాసి ప్రజలకు అంకితం చేయగలరా?...ఒకవేళ దానికి కట్టుబడి ఉండకపోతే ఏమి చెయ్యాలి?...ఇలా ఈ ప్రశ్నలన్నింటికీ స్పష్టమైన సమాధానం...హామీ...రెండూ కావాలంటున్నారు... కారణం...ఇటీవల జైట్లీ-సుజనాచౌదరి భేటీ ఉదంతం...ఉన్న అతి కాస్త నమ్మకాన్ని కూడా ఊడ్చేసిందంటున్నారు.

పైగా ఆ భేటీపై...అనేక సందేహాలు

పైగా ఆ భేటీపై...అనేక సందేహాలు

పైగా ఆ భేటీ తమలో అనేక సందేహాలు రేపిందని నెటిజన్లు వాపోతున్నారు...అసలు ఇంతకూ సుజనా-జైట్లీ భేటీ జరిగిందా లేదా?...మీ అనుకూల పత్రికలో కథనం ప్రకారం భేటీ జరిగినట్లే తెలుస్తోందని...పైగా సాక్షాత్తూ యనమల రామకృష్ణుడే ఈ భేటీ గురించి ఆందోళన వ్యక్తం చేసినట్లు వార్తలు వచ్చాయని...దాంతో భేటీ గురించి తాము అమ్మ...బాబోయ్ అనుకున్నామని...కానీ మళ్లీ అసలు ఈ భేటీనే జరగలేదని సుజనా ఆగ్రహం వ్యక్తం చేయడం చూశామని...మరైతే...ఇంత ముఖ్యమైన అంశంపైన...అలా వదిలేయకుండా...యనమలతో వివరణ ఇప్పించడం...క్షమాపణ చెప్పించడం చేయాలని...లేకపోతే తమలాంటి సామాన్యులు ఏం జరుగుతుందోనని భయపడిపోతున్నామని నెటిజన్లు రాసుకొచ్చారు.

English summary
Netizens have been making fun in social media about the latest leaks of AP CM Chandrababu Naidu related to fighting on the center.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X