వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీ మంత్రులకు కొత్త టాస్క్ అప్పగించిన సీఎం ..టెన్షన్ లో మంత్రులు

|
Google Oneindia TeluguNews

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి వైసీపీ మంత్రులకు కొత్త టాస్క్ అప్పగించారు సీఎం జగన్ . దీంతో మంత్రులకు తమ పదవి నిలబెట్టుకోవాలంటే ఉరుకులు పెట్టాల్సిన పరిస్థితి ఉంది. జగన్ తీసుకున్న తాజా నిర్ణయంతో తమ పరిస్థితి ఎలా ఉంటుందో అని మంత్రులు మల్లగుల్లాలు పడుతున్నారు. అసలు జగన్ అప్పగించిన టాస్క్ ఏంటి ? ఒకవేళ సక్సెస్ కాకుంటే ఏం జరుగుతుంది? ఎందుకు మంత్రులు ఇంతగా టెన్షన్ పడుతున్నారు ? అంటే

రాక్షసులతో యుద్ధం చేస్తున్నాం .. మీ దీవెనలుంటే విద్యా విప్లవం సృష్టిస్తాం : సీఎం జగన్రాక్షసులతో యుద్ధం చేస్తున్నాం .. మీ దీవెనలుంటే విద్యా విప్లవం సృష్టిస్తాం : సీఎం జగన్

ఏపీ మంత్రులకు కొత్త టాస్క్ ఇచ్చిన సీఎం జగన్

ఏపీ మంత్రులకు కొత్త టాస్క్ ఇచ్చిన సీఎం జగన్

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల సందడి ప్రారంభం కాబోతుంది. స్థానిక సంస్థల ఎన్నికలను మార్చి 15లోగా నిర్వహించాలని వైసీపీ సర్కార్‌ నిర్ణయం తీసుకుంది. ఇక దీంతో జగన్ మంత్రులకు స్థానిక సంస్థల ఎన్నికలను సక్సెస్ చెయ్యాలనే టాస్క్ అప్పగించారు. గత సాధారణ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన నేపధ్యంలో ఇప్పుడు కూడా స్థానిక సమరంలో విజయం సాధించాలని జగన్ భావిస్తున్నారు. అందుకే ఈ ఎన్నికల టాస్క్ ను మంత్రులకు అప్పగించారు . ఇక మంత్రులు స్థానిక సమరంలో సత్తా చాటితేనే మంత్రిగా వారికి అవకాశం ఉండేది . లేదంటే మంత్రి పదవి వూస్టింగ్ అనే సంకేతాలు కూడా ఇచ్చారని సమాచారం .

స్థానిక ఎన్నికలు సక్సెస్ చెయ్యాలని ఆదేశాలు

స్థానిక ఎన్నికలు సక్సెస్ చెయ్యాలని ఆదేశాలు

ఇక ఇప్పటికే స్థానిక నేతలకు, ఎమ్మెల్యేలకుఅభ్యర్థుల విషయంలో కష్టపాడాల్సింది ఏమీ లేదు. అంతా పార్టీనే చూసుకుంటుంది అని చెప్పిన జగన్ ఇప్పుడు గెలుపు బాధ్యతలను మంత్రులకు అప్పగించారు . అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచారం, పోల్‌ మేనేజ్‌మెంట్ వంటి అంశాల దాకా అన్నీ బాధ్యతలు మంత్రులకే అప్పగించారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా స్థానిక నేతలను, ఎమ్మెల్యేలను సమన్వయపరచడం, విభేదాలను పరిష్కరించడం వంటి కీలకమైన బాధ్యత కూడా మంత్రులకే అప్పగించారు జగన్ .

 మెజార్టీ స్థానాలు దక్కకుంటే మంత్రుల పదవులకు ఎసరు

మెజార్టీ స్థానాలు దక్కకుంటే మంత్రుల పదవులకు ఎసరు

ఎన్నికలు ముగిసే వరకూ శాఖల విషయాలు పక్కన పెట్టి ఎన్నికలపైనే పూర్తి స్థాయి దృష్టి పెట్టాలని స్పష్టం చేశారని సమాచారం . ఇంచార్జ్ మంత్రులతో పాటు లోకల్ మంత్రులు జిల్లాలకే పరిమితమై ఎన్నికల కసరత్తు పూర్తి చేయాలని సీఎం జగన్ ఆదేశించారట . దీంతో మంత్రులు స్థానిక ఎన్నికల కసరత్తులో మునిగిపోయారు.స్థానిక సమరంలో మెజారిటీ దక్కించుకోలేకపోతే మాత్రం వారి మంత్రి పదవులకు ఎసరు పెట్టినట్టే అని తెలుస్తుంది. ఎన్నికల్లో పర్ఫామెన్స్ లేకుంటే మాత్రం ఉద్వాసన పలకటం ఖాయమే అని పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది.

 లోకల్ వార్ అంటేనే భయపడుతున్న మంత్రులు

లోకల్ వార్ అంటేనే భయపడుతున్న మంత్రులు

దీంతో లోకల్ వార్ అంటేనే మంత్రులు భయపడుతున్నారు . సీఎం జగన్ తాజా నిర్ణయం మంత్రుల చావుకొచ్చింది . ఇప్పుడు ఈ టాస్క్ సక్సెస్ చేస్తేనే జగన్ మంత్రులుగా గుర్తించేది . కాబట్టి ఆదేశాలు వచ్చినప్పటి నుంచి ఎక్కువ సమయం జిల్లాలకే పరిమితమై ఉరుకులు పరుగులు పెడుతున్నారు. జగన్‌ నిర్దేశించిన లక్ష్యాలను చేరేందుకు గట్టి ప్రయత్నాలు ప్రారంభించారని అంటున్నారు. ఇక మరో వైపు ప్రతిపక్షాల నేతలు స్థానిక సమరాన్ని ఎదుర్కోటానికి సన్నాహాలు చేస్తున్నారు .

Recommended Video

Lakshmi Parvati Says Chandrababu Had Start Bus Journey For Local Body Elections | Oneindia Telugu
మంత్రులకు పెద్ద పరీక్ష పెట్టిన స్థానిక సమరం

మంత్రులకు పెద్ద పరీక్ష పెట్టిన స్థానిక సమరం

ఇక ఎన్నికల నోటిఫికేషన్ కోసం చూస్తున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా వార్‌కు సిద్ధంగా ఉన్నామంటున్నారు మంత్రులు. గత ఎన్నికల కంటే మెరుగైన పలితాలు సాధిస్తామని ధీమాగా చెబుతున్నారు.ఇక ఏపీలో తాజా పరిణామాల నేపధ్యంలో ఎన్నికలు వస్తే వైసీపీ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టి విజయం సాధించాలని ప్రతిపక్షాలు భావిస్తుంటే అందిస్తున్న సంక్షేమ పథకాలను చూపించి ఓటు బ్యాంకు కొల్లగొట్టాలని అధికార పార్టీ నేతలు చూస్తున్నారు. మొత్తంగా చెప్పాలంటే ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చినట్టు స్థానిక సమరం మంత్రులకు పెద్ద పరీక్ష పెట్టనుంది.

English summary
With the coming of local bodies elections in AP, there is tension among the YCP ministers. Candidates seeking tickets in the election to see how their situation will be with the latest decision taken by the Jagan. not only the MLAs and local spin-off leaders are in tension the ministers also in tension about local body elections.If they do not get a majority in the local body election, it is likely that their ministerial posts will be up for grabs.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X