వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శాసనమండలిలో సెలెక్ట్ కమిటీ వ్యవహారంలో కొత్త మలుపు .. అధికార పక్షానికి షాక్ ఇచ్చిన విపక్షాలు

|
Google Oneindia TeluguNews

Recommended Video

3 Capitals Bill : Abolish of AP Council || What About Select Committee Bills ? || Oneindia Telugu

ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటుకు అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లును, సీఆర్డీఏ రద్దు బిల్లులను మండలిలో సెలెక్ట్ కమిటీకి పంపాలన్న నిర్ణయం మేరకు వివిధ పార్టీల నుంచి సభ్యుల పేర్లు కమిటీలో సభ్యులుగా ఇవ్వాలని కోరారు ఛైర్మన్ షరీఫ్. ఇప్పటికే టీడీపీ ఐదుగురి పేర్లను పంపింది . బీజేపీ, పీడీఎఫ్‌ కూడ తమ సభ్యుల పేర్లను సెలెక్ట్ కమిటీ ఏర్పాటుకు పంపటం ఇప్పుడు కొత్త మలుపు తీసుకుంది.

 స్లేక్ట్ కమిటీల ఏర్పాటులో కొత్త మలుపు

స్లేక్ట్ కమిటీల ఏర్పాటులో కొత్త మలుపు


ఏపీ శాసనమండలిలో వికేంద్రీకరణ మరియు సిఆర్డిఎ రద్దు బిల్లులపై కమిటీలను ఏర్పాటు చేయడం కొత్త మలుపు తీసుకుంది. ఎంపిక చేసిన కమిటీలలో చోటు సంపాదించడానికి పార్టీలు తమ సభ్యుల పేర్లను పేర్కొంటూ ఛైర్మన్‌కు లేఖలు పంపాయి. ఛైర్మన్ నిర్దేశించిన కమిటీలను ఏర్పాటు చేయడానికి అధికార పార్టీ సభ్యులు వ్యతిరేకం అని టిడిపి సభ్యులు ఆరోపించారు. కౌన్సిల్ కార్యదర్శి, మంత్రులతో సహా ఇతర అధికారులు కూడా దీనికి మద్దతు ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మండలి రద్దు తర్వాత సెలెక్ట్ కమిటీల ఏర్పాటు నిబంధనలకు విరుద్ధం అన్న వైసీపీ

మండలి రద్దు తర్వాత సెలెక్ట్ కమిటీల ఏర్పాటు నిబంధనలకు విరుద్ధం అన్న వైసీపీ

మరోవైపు, వైయస్ఆర్సిపి సభ్యులు సెలెక్ట్ కమిటీలను ఏర్పాటు చేయడం నిబంధనలకు విరుద్ధమని పేర్కొన్నారు. కౌన్సిల్‌లో ఓటింగ్ జరగనందున, దీనిని ఎంపిక చేసిన కమిటీలకు పంపించలేమని అధికార పార్టీ ఆరోపించింది. సెలెక్ట్‌ కమిటీకి పంపాలన్న నిర్ణయం తప్పని.. పీడీఎఫ్‌, బీజేపీ సభ్యులు కూడా వ్యతిరేకిస్తున్నారని ఇన్నాళ్లూ వైసీపీ వాదించింది. ఇక ఈ సమస్య ప్రతిపక్ష సభ్యులకు, అధికార పార్టీకి మధ్య వివాదానికి దారితీసింది.

బిజెపి, పిడిఎఫ్ కూడా సభ్యుల పేర్లు ఇవ్వటంతో వైసీపీకి షాక్

బిజెపి, పిడిఎఫ్ కూడా సభ్యుల పేర్లు ఇవ్వటంతో వైసీపీకి షాక్

ఈ అంశంపై టిడిపి, బిజెపి, పిడిఎఫ్ చైర్మన్‌కు తమ పార్టీ నుండి కమిటీ సభ్యుల పేర్లు సూచిస్తూ లేఖలు ఇవ్వటం ఇప్పుడు వైసీపీకి షాకింగ్ గా మారింది. శాసనమండలిని రద్దు చేస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసినందున ఇక పాలన వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు బిల్లులకు మండలి అనుమతి అవసరం లేదని, సెలెక్ట్ కమిటీల ప్రస్తావనే లేదని భావించింది అధికార వైసీపీ . కానీ అధికార పక్షానికి విపక్షాలు షాక్‌ ఇచ్చాయి.

సెలెక్ట్ కమిటీ ఏర్పాటుకు లేఖలు రాసిన మండలి చైర్మన్

సెలెక్ట్ కమిటీ ఏర్పాటుకు లేఖలు రాసిన మండలి చైర్మన్


ఈ బిల్లులను సెలెక్ట్‌ కమిటీకి పంపాలని విచక్షణాధికారం మేరకు నిర్ణయం తీసుకున్న మండలి చైర్మన్‌ ఎం.ఏ.షరీఫ్‌.. సదరు కమిటీల్లో ఉండే సభ్యుల పేర్లు పంపాలని ఆయా పార్టీలకు లేఖలు రాస్తే ఒక్క అధికార వైసీపీ మినహాయించి అన్ని పార్టీలు తమ పార్టీ నేతల పేర్లు సభ్యులుగా సూచించారు. మండలిలో మెజారిటీ ఉన్న టీడీపీ ఇప్పటికే రెండు బిల్లులపై కమిటీలకు తమ సభ్యుల పేర్లను చైర్మన్‌కు సిఫారసు చేసింది.

టీడీపీ నుండి సభ్యుల ప్రతిపాదన

టీడీపీ నుండి సభ్యుల ప్రతిపాదన

సీఆర్‌డీఏ రద్దు బిల్లుపై అధ్యయనానికి బచ్చుల అర్జునుడు, బీద రవిచంద్ర,దీపక్‌రెడ్డి, గౌనివారి శ్రీనివాసులు, బుద్దా నాగ జగదీశ్వరరావు పేర్లను ప్రతిపాదించింది. పాలన వికేంద్రీకరణ బిల్లుపై అధ్యయనానికి లోకేశ్‌, తిప్పేస్వామి, అశోక్‌బాబు, బీటీనాయుడు, సంధ్యారాణి పేర్లను సిఫారసు చేసింది.

బీజేపీ , పీడీఎఫ్ నుండి కూడా కమిటీ సభ్యుల పేర్లు .. ఇబ్బందిలో వైసీపీ

బీజేపీ , పీడీఎఫ్ నుండి కూడా కమిటీ సభ్యుల పేర్లు .. ఇబ్బందిలో వైసీపీ

ఇక బీజేపీ నుంచి మాధవ్, సోము వీర్రాజులను , పీడీఎఫ్‌ నుంచి లక్ష్మణరావు, వెంకటేశ్వర రావు పేర్లను పంపారు.ఈ కమిటీల్లో వైసీపీ పాల్గొనేది లేదని ఇప్పటికే మండలిలో సభానేతలు, డిప్యూటీసీఎం పిల్లి సుభాశ్‌చంద్రబోస్‌, చీఫ్‌ విప్‌ ఉమ్మారెడ్డి మండలి కార్యదర్శికి లేఖలు రాశారు. అయినప్పటికీ సెలెక్ట్ కమిటీ ఏర్పాటు చేసి బిల్లులను పంపి తీరుతామన్న చందంగా చైర్మన్ వ్యవహరిస్తున్న తీరు వైసీపీని ఇబ్బంది పెడుతుంది.

English summary
The issue of AP Legislative Council referring to the two bills i.e Decentralization and CRDA repeal to select committees took a new turn. Parties have sent letters to the Chairman mentioning the names of their members to find a place in the select committees. YSRCP members countered stating that constituting committees are against the rules. The ruling party has alleged that as there was no voting done in the council, it can not be sent to select committees. The issue has become the subject of dispute between the members of the oppositions and the ruling party. The letters given to the chairman by TDP, BJP, and PDF on this aspect have become a focal point.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X