ఏపీలో ఏం చేద్దాం ? జేపీ నడ్డాతో పురంధేశ్వరి చర్చలు-కీలక వ్యాఖ్యలు..!
ఏపీలో బీజేపీ కొత్త అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన పార్టీ సీనియర్ నేత దగ్గుబాటి పురంధేశ్వరి ఇవాళ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో ఢిల్లీలో భేటీ అయ్యారు. ఏపీ బీజేపీ ఛీఫ్ గా తనను నియమించిన నేపథ్యంలో ఢిల్లీలోని నడ్డా నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా భేటీ అయిన పురంధేశ్వరి ఆయనతో తాజా రాజకీయ పరిణామాలు, ఏపీలో పార్టీ పరిస్దితిపై చర్చించారు. అనంతరం ఏపీలో పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్లాలనే అంశంపై నడ్డా ఆమెకు దిశానిర్దేశం చేశారు.
నడ్డాతో భేటీ నేపథ్యంలో పురంధేశ్వరి ట్విట్టర్ లో ఈ విషయాన్ని పంచుకున్నారు. జేపీ నడ్డాజీ తనపై ఉంచిన నమ్మకానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశానని ఆమె తెలిపారు. బాధ్యత పట్ల నా అచంచలమైన నిబద్ధత గురించి తాను ఆయనకు హామీ ఇచ్చానన్నారు. ఏపీలో బీజేపీని బలోపేతం చేసేందుకు తాను కృషి చేస్తున్నప్పటికీ, ఏపీ, ఆంధ్రుల ప్రయోజనాలను కాపాడేందుకు కూడా కృషి చేస్తానని పురంధేశ్వరి ట్వీట్ లో పేర్కొన్నారు.

ఏపీలో గత కొన్నేళ్లుగా అధ్యక్షులను మారుస్తూ వస్తున్నా బీజేపీ తలరాత మాత్రం మారడం లేదు. ఈ నేపథ్యంలో కమ్మ సామాజిక వర్గానికి చెందిన మహిళా నేత, దివంగత ఎన్టీఆర్ కుమార్తె కూడా అయిన పురంధేశ్వరిని బీజేపీ తాజాగా ఈ పదవిలో నియమించింది. రాష్ట్రంలో కమ్మ,రెడ్డి వార్ నడుస్తున్న నేపథ్యంలో ఈ రెండు సామాజిక వర్గాలకు చెందిన వారిలో ఎవరో ఒకరిని ఈ పదవికి ఎంచుకుంటే తప్ప పరిస్ధితిలో మార్పు రాదని బీజేపీ అధిష్టానం గ్రహించినట్లు తెలుస్తోంది. ఈ ఫార్ములాలో భాగంగానే పురంధేశ్వరికి కీలక బాధ్యతలు దక్కాయి.
Met @JPNadda Ji and expressed my heartfelt gratitude for the trust imposed on me. I assured him of my unwavering commitment towards the responsibility. Even as I work to strengthen BJP in AP, I shall also work towards safeguarding the interests of AP and Andhrites.
— Daggubati Purandeswari 🇮🇳 (@PurandeswariBJP) July 6, 2023
#BJP pic.twitter.com/LeYCzQ8P6F
మరోవైపు ఇప్పటికే జనసేనతో పొత్తులో ఉన్న బీజేపీ.. ఆ పార్టీతో కలిసి క్షేత్రస్ధాయిలో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించడం లేదు. దీనిపైనా అధిష్టానం ఆగ్రహంగా ఉంది. దీంతో పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబు పంచన చేరిపోయారు. ఇప్పుడు చంద్రబాబుతో పొత్తు పెట్టుకుని ఏపీ, తెలంగాణలో పోటీచేసేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. మారిన పరిస్ధితుల నేపథ్యంలో పురంధేశ్వరి సేవల్ని తెలంగాణలో సైతం వినియోగించుకునేందుకు వీలుందని బీజేపీ అధిష్టానం భావిస్తోంది.
-
పాపం.. అన్నామలై: అన్ హ్యాపీ- మొదటికే మోసం, పోటీకి దూరం? -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!!












Click it and Unblock the Notifications