అనుమానం: ప్రేమించి, పెళ్లాడిన 15 రోజులకే భార్య హత్య

తూర్పు గోదావరి జిల్లా అమలాపురానికి చెందిన అంజలి(20), ఆమె సోదరి మేరీ కలిసి కొంతకాలంగా నగరంలోని సాతంరాయిలో ఉంటున్నారు. ఓ ప్రయివేట్ కంపెనీలో పని చేస్తూ స్థానిక రాజీవ్ గృహకల్పలో నివాసముంటున్నారు. కాగా విశాఖ జిల్లా ఎలమంచిలికి చెందిన జాన్ ఆడమ్‌సన్ కాటేదాన్‌లో కూలీగా పని చేస్తున్నాడు.
జాన్, అండలి మధ్య పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారింది. దీంతో ఈ నెల 11వ తేదీన మధుబన్ కాలనీలోని ఓ దేవాలయంలో పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. దంపతులు సాతంరాయిలో కాపురం పెట్టారు. అంజలి చెల్లెలు మేరీ సమీపంలోనే మరోచోట ఉంటోంది. ఇదిలా ఉండగా పెళ్లి జరిగిన నాటి నుండి జాన్ భార్యను అనుమానిస్తూ వేధిస్తుండేవాడు.
ఎప్పటిలాగే శనివారం ఉదయం మేరీ తన సోదరి అంజలి ఇంటికి వచ్చి బావను అక్క గురించి అడిగింది. ఇంట్లో పడుకుందని జాన్ చెప్పాడు. లోపలకు వెళ్లి చూడగా అంజలి విగత జీవిగా పడి ఉండటంతో మేరీ విలపించింది. చుట్టుపక్కల వారు అక్కడకు రాగా జాన్ పరారయ్యాడు. గొంతు నులిమినట్లు ఆధారాలు ఉన్నాయి. సమాచారం అందడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications