అమరావతికి NHAI షాక్ ..! విజయవాడలో విలీనం..!
ఏపీలో తాజాగా అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్ గత ఐదేళ్ల వైసీపీ పాలనలో విధ్వంసమైన అమరావతి రాజధానిని తిరిగి గాడిన పెట్టేందుకు ప్రయత్నిస్తోంది. ఇందుకోసం గతంలో తమ ప్రభుత్వం వివిధ సంస్థలకు భూములు కేటాయించిన ప్రాంతాల్ని సుందరంగా తీర్చిదిద్దడంతో పాటు కొత్త ప్రాజెక్టులకు ప్రయత్నిస్తోంది. అదే సమయంలో రాష్ట్రంలో ప్రధాన జాతీయ రహదారుల విస్తరణ, అమరావతితో లింక్ కోసం కేంద్రం నుంచి ఆమోదం కూడా తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో అమరావతికి ఓ విషయంలో షాక్ తగిలింది.
అమరావతి రాజధానికి అవసరమైన కీలక ప్రాజెక్టుల కోసం కేంద్రం ఓవైపు అనుమతులు మంజూరు చేస్తున్న తరుణంలో అదే ప్రాంతంలో ఉన్న తమ యూనిట్ ను మూసేయాలని జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) సంచలన నిర్ణయం తీసుకుంది. అమరావతిలో ప్రాజెక్టుల అమలు కోసం గతంలో ఏర్పాటు చేసిన ప్రాజెక్టు ఇంప్లిమెంట్ యూనిట్ (PIU)ను మూసేయాలని సంస్థ నిర్ణయం తీసుకుంది. దీన్ని విజయవాడలోని తమ ప్రాజెక్టు ఇంప్లిమెంట్ యూనిట్ లో విలీనం చేస్తోంది.

గతంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అమరావతిలో NHAI ప్రాజెక్టు ఇంప్లిమెంట్ యూనిట్ ఏర్పాటైంది. అప్పట్లో అనంతపురం-అమరావతి ఎక్స్ ప్రెస్ వే, అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు వంటి పలు ప్రాజెక్టులను ఇది చేపట్టింది. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చాక ఇవన్నీ పక్కనబెట్టేసింది. దీంతో పనిలేకుండా పోయిన అమరావతి యూనిట్ కు ఇతరత్రా పనులు అప్పగించేశారు. ఇప్పుడు ఏకంగా దీన్ని మూసేసి విజయవాడ యూనిట్లో విలీనం చేసేస్తున్నారు. దీనిపై కేంద్రాన్ని సంప్రదించి తిరిగి తెరిపించేందుకు ప్రభుత్వం ప్రయత్నించే అవకాశముంది. ే












Click it and Unblock the Notifications