పేలుళ్లతో భయపెడుతున్నారు: కోర్టుకు అక్తర్, రిమాండ్
హైదరాబాద్: అక్తర్, భత్కల్‌లు భారత్‌లో బాంబు పేలుళ్లకు పాల్పడుతూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని జాతీయ దర్యాఫ్తు సంస్థ(ఎన్ఐఏ) గురువారం కోర్టుకు తెలిపింది. దిల్‌సుఖ్ నగర్ జంట పేలుళ్ల కేసులో నిందితుడు అసదుల్లా అక్తర్‌ను నాంపల్లి కోర్టులో హాజరుపర్చారు.
అతనికి కోర్టు 17వ తేది వరకు రిమాండు విధించింది. దీంతో అతనిని పోలీసులు చర్లపల్లి జైలుకు తరలించారు. దిల్‌సుఖ్ నగర్ పేలుళ్ల కేసులో యాసిన్ భత్కల్ ఐదవ నిందితుడిగా ఉన్నాడు.

కాగా, హైదరాబాదు - గోవా, హైదరాబాదు - బెంగళూరు జాతీయ రహదారుల్లో అక్తర్, భత్కల్‌లు రెక్కీ నిర్వహించారని, పలు ముఖ్య పట్టణాలలోను రెక్క నిర్వహించారని ఈ సందర్భంగా ఎన్ఐఏ తెలిపింది. పాకిస్తాన్ నుండి వారికి ఆదేశాలు వస్తున్నాయని పేర్కొంది.
ఆ ఆదేశాలతో భారత్‌లో బాంబు పేలుళ్లకు పాల్పడుతూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, వీరు నరమాంస భక్షకుల్లాంటి వారని ఎన్ఐఏ తెలిపింది. వారి నుండి సమాచారం రాబట్టాల్సి ఉందని తెలిపింది. కాగా, యాసిన్ భత్కల్, అక్తర్‌లను ఇటీవల అరెస్టు చేసిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications