ప్రభుత్వ వాహనంలో పవన్ కల్యాణ్ హీరోయిన్ షికార్లు.. మా ఏపీలో అంతే సార్
నిధి అగర్వాల్..తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన నిధి అగర్వాల్, ఆ తర్వాత హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. తన గ్లామర్, నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న తార నిధి అగర్వాల్. బాలీవుడ్‌లో 'మున్నా మైఖేల్' సినిమాతో అరంగేట్రం చేసింది. బాలీవుడ్‌లో అడుగుపెట్టి, తెలుగు, తమిళ చిత్రాలలో తనదైన ముద్ర వేసి, యువతరాన్ని ఆకట్టుకుంటుంది.
తన అందం, అభినయంతో ప్రేక్షకులను మెప్పిస్తుంది. 'సవ్యసాచి'తో తెలుగు తెరకు పరిచయమై, 'మిస్టర్ మజ్ను', 'ఇస్మార్ట్ శంకర్' వంటి చిత్రాలతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అయితే అమ్మడు కెరీర్‌లో ఇప్పటి వరకు సరైన హిట్ మాత్రం లేదు. స్టార్ హీరోలతో నటించినప్పటికీ ఆమె జాతకం మాత్రం మారలేదు. 'ఇస్మార్ట్ శంకర్' సినిమా నిధి కెరీర్‌కు పెద్ద బూస్ట్ ఇచ్చింది.

అందులో ఆమె పాత్ర, గ్లామరస్ లుక్ యువతను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అయినప్పటికీ ఆమె అనుకున్నంత స్థాయిలో ఆఫర్లు మాత్రం దక్కలేదు.ప్రస్తుతం నిధి అగర్వాల్ కెరీర్‌లో ఒక కీలక దశలో ఉంది. ఆమె ఇటీవలే నటించిన చిత్రం 'హరిహర వీరమల్లు'. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, జ్యోతి కృష్ణ దర్శకత్వంలో తెరకెకక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయం మూేటగట్టుకుంది. కనీస వసూళ్లను కూడా సాధించలేక చతికిలపడింది.
Wtf Nidhi Agarwal visiting malls in Government Vehicles 🙏
— Syera (@NeelFannn) August 11, 2025
pic.twitter.com/fbw1Hd8Cg5
ఇదిలా ఉంటే నిధి అగర్వాల్‌కు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. ఏపీ ప్రభుత్వానికి చెందిన వాహనంలో నిధి అగర్వాల్ ప్రయాణించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో ప్రత్యక్షం అయింది. అది కూడా ఓ షాపింగ్ మాల్ కోసం ఆమె ప్రభుత్వం వాహనంలో ప్రయాణించింది. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రజల పన్నులతో నిర్వహించే వాహనాలను ఇలా హీరోయిన్ల కోసం వినియోగించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. వైసీపీ శ్రేణులు మాత్రం దీనిపై ఘాటుగానే రియాక్ట్ అవుతున్నారు. మా ఏపీలో అంతే సార్.. ఏదైనా సాధ్యమే అంటూ కూటమి ప్రభుత్వంపై కౌంటర్స్ వేస్తున్నారు.
'హరిహర వీరమల్లు' సినిమా షూటింగ్ సమయంలో కూడా ఇలానే ప్రభుత్వ వాహనాలను వినియోగించినట్టు విమర్శలు వచ్చాయి. ఎప్పుడు ఏకంగా ఆయనతో నటించిన హీరోయిన్ కోసం ప్రభుత్వ వాహనం కేటాయించడంపై సర్వత్ర విమర్శలు వినిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications