ఫలించిన వేణుస్వామి పూజలు.. అదిరిపోయే ఆఫర్?
వేణుస్వామి.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సినిమా సెలబ్రిటీలకు, రాజకీయ సెలబ్రిటీలకు జాతకం చెబుతూ ఉంటారు. వారికి జాతకాలు చెప్పి చెప్పి.. ఆ సమయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు.. కొన్ని నిజం కావడంతో ఆయన కూడా ఒక సెలబ్రిటీ అయ్యారు. మొదట రష్మికతో పూజలు చేయించగా టాప్ హీరోయిన్ అయిపోవడమేకాదు.. నేషనల్ క్రష్ గా మారింది.
సమంత-నాగచైతన్య కాపురం నిలవదు.. విడాకులు తీసుకుంటారంటూ చెప్పారు. ఆయన చెప్పినట్లుగానే వీరిద్దరూ విడిపోవడమే వేణుస్వామి ఫేమస్ అవడానికి కారణమైంది. రష్మిక స్టార్ హీరోయిన్ అయినప్పుడు యావరేజ్ గా పేరుతెచ్చుకున్న వేణుస్వామి సమంత-నాగచైతన్య విడాకుల విషయం చెప్పి సూపర్ హిట్ కొట్టారు.

ఆ తర్వాత నిధి అగర్వాల్ తో కూడా పూజలు చేయించారు. వేణుస్వామి చేసిన పూజలు ఫలించలేదా? ఏమిటి? ఆయన చెప్పినవన్నీ ఉత్తుత్తి మాటలేనా? అని నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. అయితే తాజాగా నిధి అగర్వాల్ బంపర్ ఆఫర్ అందుకున్నట్లు తెలుస్తోంది. ప్రభాస్ కథానాయకుడిగా మారుతి దర్శకత్వంలో షూటింగ్ జరుపుకుంటున్న చిత్రంలో కథానాయికగా ఎంపికైనట్లు వార్త వైరల్ అవుతోంది.
ఇస్మార్ట్ శంకర్ తో సూపర్ హిట్ అందుకున్న ఈ బ్యూటీకి ఆ తర్వాత అందుకు తగ్గ అవకాశాలు అందుకోలేకపోయింది. పవన్ కల్యాణ్ సరసన అదిరిపోయే ఆఫర్ అందుకుంది. హరిహరవీరమల్లు సినిమాకు నిధి అగర్వాలే హీరోయిన్. అయితే ఆ చిత్రం 2020 నుంచి పడుతూ లేస్తూ షూటింగ్ జరుపుకుంటోంది. ఏఎం రత్నం నిర్మాత కాగా, క్రిష్ దర్శకుడు. తాజాగా ప్రభాస్ సరసన ఆఫర్ అందుకోవడంతో వేణుస్వామి పూజలు ఫలించాయని తెలుగు సినీ పరిశ్రమలో టాక్ వినపడుతోంది.












Click it and Unblock the Notifications