సైబర్ నేరాలు: నైజీరియన్ గ్యాంగ్ పట్టివేత (పిక్చర్స్)
హైదరాబాద్: తప్పుడు ధృవీకరణ పత్రాలద్వారా బ్యాంకుల్లో కరెంట్ అకౌంట్‌లను తెరిచి అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ఆన్‌లైన్‌లో మోసాలకు పాల్పడిన మోస్ట్ వాంటెడ్ నైజీరియన్ గ్యాంగ్‌ను హైదరాబాద్ నగర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి రెండు ల్యాప్‌టాప్‌లు, మూడు ఇంటర్నెట్ డేటా కార్డులు, ఆరు ఎటిఎంకార్డులు, ఆరు సెల్‌ఫోన్లు 20 సిమ్‌కార్డులతోపాటు ఓపెల్‌కోర్సా కారును స్వాధీనం చేసుకుని అరెస్టుచేసి రిమాండ్‌కు తరలించారు.
శుక్రవారం హైదరాబాద్ పోలీసు కమిషనర్ అనురాగ్ శర్మ ఆ గ్యాంగ్ పట్టివేతకు సంబంధించిన వివరాలను మీడియా ప్రతినిధుల సమావేశంలో వివరించారు. నైజీరియన్లు సన్నీ ఉచె ఉజోమా, లక్నోకు చెందిన ప్రభా జయదీప్, మైఖేల్ అనింబ, బన్వీగ్‌బున, నివాజోనోబి, తినోవాలు, లక్నో, బెంగుళూరు కేంద్రంగా ఆన్‌లైన్ మోసాలకు పాల్పడుతున్నారు.
పథకం ప్రకారం తొలుత ఎంపిక చేసుకున్న నగరాల్లో గదులు అద్దెకు తీసుకుని నకిలీ ధృవప్రతాలతో రెంటల్ అగ్రిమెంట్ కుదుర్చుకుంటారు. అనంతరం ల్యాండ్ ఫోన్ కనెక్షన్ పొంది నెల అనంతరం వచ్చిన బిల్లుపై చిరునామా ఆధారంగా కార్మిక శాఖ నుంచి ట్రేడ్ లైసెన్సులు పొంది బ్యాంకులద్వారా కరెంట్ అకౌంట్‌లను తెరుస్తారు. ఆ తర్వాత ఆన్‌లైన్‌లో డమీ బ్యాంకు వెబ్‌సైట్‌ను సృష్టించి లక్షలాదిమందికి ఈ మెయిల్స్ పంపి కార్పొరేట్ ఐడి, యూజర్‌ఐడిలను అక్రమంగా సేకరించి సదరు ఖాతాదారుల పేరిట డూప్లికేట్ సిమ్‌లను సృష్టించి బ్యాంకుల ద్వారా ఆన్‌లైన్‌లో అప్పటికే సృష్టించిన బినామీ ఖాతాలకు డబ్బులను బదిలీ చేస్తారు.
అలా దారి మళ్లించిన డబ్బుతో గార్మెంట్స్ కొనుగోలు చేసి చట్టానికి చిక్కకుండా వారి దేశాలకు ట్రాన్స్‌పోర్టు చేసి అక్కడ సొమ్ము చేసుకుంటారు. ఈ విధంగానే సంగ్వి కార్పొ బ్రాంచి మేనేజర్ కైలాష్‌నాథ్ సేత్ అనే వ్యక్తి ఖాతాలోంచి ఆయనకు తెలియకుండానే కాన్పూర్ పిఎన్‌బి అకౌంట్ విక్రమాదిత్య ఖాతాకు రూ.5 లక్షలు ట్రాన్స్‌ఫర్ అయింది. బాధితుడి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు విచారణలో నిందితులు ఉపయోగించిన సెల్‌ఫోన్ ఐఎంఇఐ నెంబర్లద్వారా తీగలాగితే డొంక కదిలింది.
పోలీసుల దర్యాప్తులో తేలిన సమాచారం మేరకు లక్నో, బెంగుళూరులలో వీరిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులు ఉపయోగించిన ల్యాప్ టాప్‌లలోని సమాచారంతో దర్యాప్తు ముమ్మరం చేసామని, మరిన్ని వివరాలు వెలుగులోకి వస్తాయని అనురాగ్ శర్మ తెలిపారు.

నైజీరియన్ ముఠా పట్టివేత
నకిలీ ధ్రువపత్రాలతో బ్యాంకుల్లో కరెంట్ ఖాతాలు తెరిచి సైబర్ నేరాలకు పాల్పడుతున్న నైజీరియన్ ముఠాను పోలీసులు పట్టుకున్నారు.

నైజీరియన్ ముఠా పట్టివేత
ఈ మెయిల్స్ పంపి కార్పొరేట్ ఐడి, యూజర్‌ఐడిలను అక్రమంగా సేకరించి సదరు ఖాతాదారుల పేరిట డూప్లికేట్ సిమ్‌లను సృష్టించి బ్యాంకుల ద్వారా ఆన్‌లైన్‌లో అప్పటికే సృష్టించిన బినామీ ఖాతాలకు డబ్బులను బదిలీ చేస్తారు.

నైజీరినయ్ ముఠా పట్టివేత
శుక్రవారం హైదరాబాద్ పోలీసు కమిషనర్ అనురాగ్ శర్మ ఆ గ్యాంగ్ పట్టివేతకు సంబంధించిన వివరాలను మీడియా ప్రతినిధుల సమావేశంలో వివరించారు.

నైజీరియన్ ముఠా పట్టివేత
ఆన్‌లైన్‌లో డమీ బ్యాంకు వెబ్‌సైట్‌ను సృష్టించి లక్షలాదిమందికి ఈ మెయిల్స్ పంపి కార్పొరేట్ ఐడి, యూజర్‌ఐడిలను అక్రమంగా సేకరించి సదరు ఖాతాదారుల పేరిట డూప్లికేట్ సిమ్‌లను సృష్టించి బ్యాంకుల ద్వారా ఆన్‌లైన్‌లో అప్పటికే సృష్టించిన బినామీ ఖాతాలకు డబ్బులను బదిలీ చేస్తారు.

నైజీరియన్ ముఠా పట్టివేత
నైజీరియన్లు సన్నీ ఉచె ఉజోమా, లక్నోకు చెందిన ప్రభా జయదీప్, మైఖేల్ అనింబ, బన్వీగ్‌బున, నివాజోనోబి, తినోవాలు, లక్నో, బెంగుళూరు కేంద్రంగా ఆన్‌లైన్ మోసాలకు పాల్పడుతున్నారు.

నైజీరియన్ ముఠా పట్టివేత
నిందితులు ఉపయోగించిన ల్యాప్ టాప్‌లలోని సమాచారంతో దర్యాప్తు ముమ్మరం చేసామని, మరిన్ని వివరాలు వెలుగులోకి వస్తాయని అనురాగ్ శర్మ తెలిపారు.

నైజీరియన్ ముఠా పట్టివేత
నిందితుల నుంచి రెండు ల్యాప్‌టాప్‌లు, మూడు ఇంటర్నెట్ డేటా కార్డులు, ఆరు ఎటిఎంకార్డులు, ఆరు సెల్‌ఫోన్లు 20 సిమ్‌కార్డులతోపాటు ఓపెల్‌కోర్సా కారును స్వాధీనం చేసుకుని అరెస్టుచేసి రిమాండ్‌కు తరలించారు.












Click it and Unblock the Notifications