Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పోసాని మెంటల్ కృష్ణ ..పిచ్చాసుపత్రిలో చేర్పించండి : పవన్ కళ్యాణ్ దేవుడు; భగ్గుమన్న నిహారిక

పవన్ కళ్యాణ్ పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన రచయిత, దర్శకుడు, నిర్మాత నటుడు పోసాని కృష్ణ మురళిపై నిహారిక సంచలన వ్యాఖ్యలు చేశారు. పోసాని కృష్ణ మురళి సినిమాలలోనే కాదు రియల్ లైఫ్ లోనూ మెంటల్ కృష్ణ అంటూ కృష్ణ మురళి పై మండిపడ్డారు. పోసానిని పిచ్చాసుపత్రిలో చేరిస్తే బాగుంటుందని జనసేన మహిళా నేత, వీర మహిళ నిహారిక తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

పోసాని కృష్ణ మురళి అచ్చోసిన ఆంబోతులా మాట్లాడుతున్నాడు

పోసాని కృష్ణ మురళి అచ్చోసిన ఆంబోతులా మాట్లాడుతున్నాడు

ఏపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ పవన్ కళ్యాణ్ కొన్ని మాటలు మాట్లాడితే పోసాని కృష్ణ మురళి అచ్చోసిన ఆంబోతులా నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని నిహారిక ఆగ్రహం వ్యక్తం చేశారు. పోసాని కృష్ణ మురళి మెంటల్ కృష్ణలా మాట్లాడుతున్నారని విరుచుకుపడిన ఆమె రిపబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు కేవలం ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పైనే అని వ్యాఖ్యానించారు.

జగన్మోహన్ రెడ్డి పై పవన్ కళ్యాణ్ కామెంట్స్ చేసినందుకే పోసాని కృష్ణ మురళి నోటికొచ్చినట్టు దుర్భాషలాడారని, ఆయనపై తక్షణం స్పందించి చర్యలు తీసుకోవాలని జనసేన పార్టీ నాయకురాలు నిహారిక డిమాండ్ చేశారు.పవన్ కళ్యాణ్ దేవుడు వంటి వాడని వీరమహిళ నిహారిక పేర్కొన్నారు.

ఆడవాళ్ళ గురించి పవన్ ఒక్క మాట కూడా మాట్లాడలేదు

ఆడవాళ్ళ గురించి పవన్ కళ్యాణ్ ఒక్క మాట కూడా మాట్లాడలేదని, ఆయన ఎప్పుడూ మహిళలను గౌరవిస్తారని ఆమె స్పష్టం చేశారు. పోసాని కృష్ణ మురళిని ప్రెస్ మీట్స్ నిర్వహించకుండా బహిష్కరించాలని, నోటికొచ్చినట్టు అసభ్య పదజాలంతో మాట్లాడుతున్న పోసాని కృష్ణ మురళి పై తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని జనసేన వీర మహిళ డిమాండ్ చేశారు. సినీ వర్గాలు కూడా పోసాని కృష్ణ మురళి పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పవన్ కళ్యాణ్ పై అనవసరమైన ఆరోపణలు చేస్తే సహించేది లేదని తేల్చి చెప్పారు.

 పవన్ తో పాటు వివాదంలోకి పవన్ ఫ్యామిలీ .. పోసానిపై ఫిర్యాదు

పవన్ తో పాటు వివాదంలోకి పవన్ ఫ్యామిలీ .. పోసానిపై ఫిర్యాదు

మొత్తానికి పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంపై, పవన్ కళ్యాణ్ కుటుంబసభ్యులపై దుర్భాషలాడుతూ పోసాని కృష్ణమురళి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చిలికిచిలికి గాలివానగా మారుతున్నాయి. పోసాని కృష్ణ మురళి పవన్ కళ్యాణ్ తో పాటు ఆయన ఫ్యామిలీని కూడా వివాదాల్లోకి లాగడం పైన విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సోషల్ మీడియా వేదికగా పోసాని కృష్ణ మురళిపై జనసైనికులు దుమ్మెత్తిపోస్తున్నారు.

పవన్ కళ్యాణ్ ను సైకో అనటం, ఆయన కుటుంబాన్ని , ముఖ్యంగా ఆడవాళ్ళను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇప్పటికే పోసాని కృష్ణమురళి వ్యవహారంపై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అసోసియేషన్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. దీంతో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Recommended Video

    Tollywood Producers Meets AP minister Perni Nani
    పోసానిపై ఫైర్ అయ్యింది మెగా డాటర్ నిహారిక అని ప్రచారం

    పోసానిపై ఫైర్ అయ్యింది మెగా డాటర్ నిహారిక అని ప్రచారం

    ఇక పోసాని కృష్ణమురళి పై జనసేన పార్టీ నాయకురాలు నిహారిక మండిపడితే నాగబాబు కుమార్తె నిహారిక పోసాని కృష్ణమురళి పై మండిపడినట్టు సోషల్ మీడియాలో పెద్దఎత్తున ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే నాగబాబు పవన్ కళ్యాణ్ పై వైసీపీ నేతలు, పోసాని కృష్ణమురళి చేసిన వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కుక్క మొరిగిందనుకో అంటూ నాగబాబు సెటైర్లు వేశారు. మీమ్స్ వీడియోలతో పవన్ కళ్యాణ్ పై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్న వారికి పవర్ఫుల్ పంచ్ లు వేశారు. మొత్తానికి ఈ వ్యవహారం ఏపీ రాజకీయాలను కుదిపేసింది. అటు సినీ వర్గాల్లోనూ ఉత్కంఠను రేకెత్తిస్తోంది.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+