అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పంచాయతీ వార్ : సీఎస్ కు నిమ్మగడ్డ లేఖాస్త్రం ; వాటిపై సీఎం జగన్ ఫోటో తొలగించాలని ఆదేశం

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన తొలివిడత నామినేషన్ల పర్వం నేటి నుంచి కొనసాగుతుంది . పంచాయతీ ఎన్నికల కీలక ఘట్టం ఈ రోజు మొదలు కాగా అటు ఎన్నికల సంఘం , ఇటు ప్రభుత్వ అధికారులు నామినేషన్ల స్వీకరణ పనుల్లో బిజీగా ఉన్నారు . ఇదిలా ఉంటే రాష్ట్ర ఎన్నికల సంఘానికి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మధ్య చోటుచేసుకున్న ఘర్షణ వాతావరణం మాత్రం అలాగే కొనసాగుతుంది.

అధికారులకు నిమ్మగడ్డ బ్లాక్ మెయిల్ , చంద్రబాబుకు ఎస్ఈసి బంట్రోతు : మంత్రి పెద్దిరెడ్డి ఫైర్అధికారులకు నిమ్మగడ్డ బ్లాక్ మెయిల్ , చంద్రబాబుకు ఎస్ఈసి బంట్రోతు : మంత్రి పెద్దిరెడ్డి ఫైర్

ఎన్నికల కోడ్ అమల్లో ఉంది .. ఆ సర్టిఫికెట్ల మీద సీఎం జగన్ ఫోటో తొలగించండి

ఎన్నికల కోడ్ అమల్లో ఉంది .. ఆ సర్టిఫికెట్ల మీద సీఎం జగన్ ఫోటో తొలగించండి

ఎస్ఈ సి మరియు ప్రభుత్వం ఒకరు తీసుకున్న నిర్ణయాలకు ఇంకొకరు కౌంటర్ వేస్తూ పంచాయతీ ఎన్నికలలో ఆసక్తికర చర్చకు కారణమవుతున్నారు. ఇక తాజాగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ కు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మరో లేఖ రాశారు. పంచాయతీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉందని, ఈ సమయంలో ప్రభుత్వం జారీ చేస్తున్న కుల ధ్రువీకరణ పత్రాలు , నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ల మీద సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోటోలను తొలగించాలని లేఖలో పేర్కొన్నారు.

కుల ధ్రువీకరణ పత్రాలు, ఎన్ఓసిలపై జగన్ ఫోటోలు ఎన్నికల నియమావళికి విరుద్ధం

కుల ధ్రువీకరణ పత్రాలు, ఎన్ఓసిలపై జగన్ ఫోటోలు ఎన్నికల నియమావళికి విరుద్ధం

అభ్యర్థులకు తహసీల్దార్లు జారీచేసే కుల ధ్రువీకరణ పత్రాలు, ఎన్ఓసిలపై సీఎం వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫోటో ఉండడం ఎన్నికల నియమావళికి విరుద్ధం అని పేర్కొన్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఈ మేరకు తహశీల్దార్లకు ఆదేశాలు జారీ చేయాల్సిందిగా చీఫ్ సెక్రెటరీ కి సూచించారు. అదే విధంగా ఎన్ఓసీలు, కుల ధృవీకరణ పత్రాల జారీలో జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని చీఫ్ సెక్రెటరీ ఆదిత్యనాథ్ దాస్ కు సూచించారు .

 సర్టిఫికెట్ల జారీలో వివక్ష లేకుండా చూడాలని ఆదేశం

సర్టిఫికెట్ల జారీలో వివక్ష లేకుండా చూడాలని ఆదేశం

అదేవిధంగా పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు జారీచేసే సర్టిఫికెట్ల విషయంలో ఎలాంటి వివక్ష లేకుండా అందరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా అవసరమైన ధృవీకరణ పత్రాలు జారీ చేసేలా చూడాలని పేర్కొన్నారు .

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలను చాలా సీరియస్ గా తీసుకున్న నిమ్మగడ్డ రమేష్ కుమార్, ఎన్నికల నిర్వహణకు సంబంధించి ప్రతి చిన్న విషయం పైన ప్రత్యేకమైన దృష్టి పెడుతున్నారు.

రాయలసీమ జిల్లాలలో నిమ్మగడ్డ పర్యటన .. అధికారులకు ఎన్నికలపై కీలక ఆదేశాలు

రాయలసీమ జిల్లాలలో నిమ్మగడ్డ పర్యటన .. అధికారులకు ఎన్నికలపై కీలక ఆదేశాలు

అందులో భాగంగానే ఇప్పటికే పలుచోట్ల జరిగిన ఏకగ్రీవాలపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు అందగా, సాంప్రదాయానికి భిన్నంగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ క్షేత్రస్థాయి పర్యటనకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా ఇవాళ రేపు రెండు రోజుల పాటు రాయలసీమ జిల్లాలలో ఆయన పర్యటించనున్నారు. ఆయన జిల్లా అధికారులకు ఎన్నికలపై కీలక ఆదేశాలను ఇవ్వడానికి, అక్కడ ఎన్నికల తీరును పరిశీలించడానికి నిమ్మగడ్డ రమేష్ కుమార్ పర్యటన సాగిస్తున్నారు.

Recommended Video

Chandrababu స్ఫూర్తితోనే నిమ్మగడ్డ పని చేస్తున్నారు - Ambati Rambabu విమర్శ

English summary
Recently, state election commissioner Nimmagadda Ramesh Kumar wrote another letter to Chief Minister Adityanath Das. The letter said that the election code was in force in the state in the run-up to the panchayat elections and that CM YS Jaganmohan Reddy photos should remove on the caste certificates and no-objection certificates issued by the government at this time.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X