2వ తరగతి విద్యార్థినిపై 9వ తరగతి విద్యార్థి లైంగిక దాడి
హైదరాబాద్: రెండో తరగతి చదువుతున్న విద్యార్థినిపై తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థి లైంగిక దాడి జరిగింది. ఈ సంఘటన అత్యంత సంచలనం కలిగించింది. పట్టపగులు, అందరూ నలువైపుల తిరుగుతుండగానే ఈ సంఘటన జరిగింది. హైదరాబాద్ నేరేడ్‌మెట్ చంద్రగిరి కాలనీలోని డీఏవీ పబ్లిక్ స్కూల్‌లో పది రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా సోమవారం వెలుగులోకి వచ్చింది.
ఇటీవల పోలీసులు లైంగిక దాడులను అరికట్టడానికి ప్రత్యేకంగా రూపొందించిన కార్యాచరణ ప్రణాళిక అమల్లో భాగంగానో విద్యార్థులకు కౌన్సెలింగ్ ఇచ్చే ప్రక్రియను ప్రారంభించారు. ఈ విషయం బాలికల ద్వారా వారి తల్లిదండ్రులకు తెలిసింది. ఇప్పటి వరకూ లేని ఈ ప్రక్రియను ఎందుకు అమలు చేస్తున్నారని తల్లిదండ్రులు ఆరా తీశారు. రెండో తరగతి విద్యార్థిని బాత్‌రూమ్‌కు వెళ్లిన సమయంలో లైంగిక దాడికి ప్రయత్నించాడనే విషయం తెలిసింది. వెంటనే బాలికల తల్లిదండ్రులు కొందరు పాఠశాల వద్ద ఆందోళనకు దిగారు.

తెలుగుదేశం, బిజెపిలతో పాటు బీజేవైఎం, టీఎన్‌ఎస్‌ఎఫ్ సంఘాల నేతలు వారికి మద్దతుగా నిలిచారు. యాజమాన్యం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పాఠశాల ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో మల్కాజిగిరి ఉపకమిషనర్ రమారాజేశ్వరి ఘటనా స్థలానికి చేరుకున్నారు. లోగడ ఈ విధంగానే ఒక ఉపాధ్యాయుడు విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో కూకట్‌పల్లిలోని శాఖకు బదిలీ చేశారని తల్లిదండ్రులు తెలిపారు.
ఈ విషయాన్నీ యాజమాన్యం గోప్యంగానే ఉంచిందని ఆరోపించారు. యాజమాన్య నిర్లక్ష్య ధోరణి కారణంగానే ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయని విమర్శించారు. రెండో తరగతి విద్యార్థినిపై లైంగిక దాడి యత్నానికి సంబంధించి నేరేడ్‌మెట్ పోలీసులకు ఫిర్యాదు అందింది.
చర్యలు తీసుకుంటాం: ప్రిన్సిపాల్ సీతాకిరణ్
సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలించిన తర్వాత విద్యార్థి లైంగిక దాడికి యత్నించినట్టు తేలితే అతడిపై చర్యలు తీసుకుంటామని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సీతాకిరణ్ తెలిపారు. లైంగిక దాడి విషయం తమ దృష్టికి రాలేదని, ఇక నుంచి అలాంటి ఘటనలకు తావు లేకుండా చైల్డ్ అబ్యూజ్ కమిటీని ఏర్పాటు చేస్తామని ఆమె చెప్పారు.












Click it and Unblock the Notifications