అత్తారింట్లో కోడలే: అవకాయ పెట్టేసిన కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్(ఫొటోలు)

పశ్చిమగోదావరి: దేశానికి రాజు అయిన తల్లికి కొడుకే అన్నట్లుగా.. కేంద్రమంత్రి అయినా అత్తారింట్లో కోడలే అని రుజువు చేశారు నిర్మలా సీతారామన్. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రిగా ఎంతో బిజీగా ఉన్నప్పటికీ తన అత్తగారింటికి వచ్చిన ఆమె, అవకాయ పెట్టే పనిలో పడ్డారు.

తమిళనాడుకు చెందిన నిర్మలా సీతారామన్.. పరకాల ప్రభాకర్‌ను పెళ్లి చేసుకుని పశ్చిమగోదావరి జిల్లా కోడలయ్యారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్ సతీమణి అయిన నిర్మల తన అత్తగారింటికి వచ్చారు.

Nirmala Sitharaman in her aunt's house

ప్రస్తుతం ఆవకాయ సీజన్ కావడంతో పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలోని ఈశావాస్యం'లో అందరూ కలిసి ఆవకాయ, తొక్కుడు పచ్చడి, బెల్లం ఆవకాయ పెట్టుకున్నారు.

కాగా, ఈ విశేషాలను పరకాల ప్రభాకర్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా పదిమందితో పంచుకున్నారు. ఈశావాస్యమ్‌లో పునరపి ఆవకాయం! అని.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+