జగన్ స్కీమ్ సూపర్- సీఎం ట్వీట్ రీట్వీట్ చేసిన నీతి ఆయోగ్
కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా నాణ్యమైన ఇంటర్నెట్ సేవల్ని అందుబాటులోకి తెచ్చేందుకు వీలుగా భారత్ నెట్ అనే కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రాలకు నాణ్యమైన ఇంటర్నెట్ అందించేందుకు తన వంతు సహకారం అందిస్తోంది. ఏపీ సహా పలు రాష్ట్రాలు ఈ ప్రాజెక్టు ఫలితాన్ని అందిపుచ్చుకుంటూ పలు ఇతర కార్యక్రమాలు కూడా చేపడుతున్నాయి. ఇలా ఏపీలో వైసీపీ సర్కార్ అమలు చేస్తున్న కార్యక్రమానికి నీతి ఆయోగ్ ప్రశంసలు లభించాయి.
ఏపీలో డిజిటల్ లైబ్రరీలతో పాటు నాణ్యమైన ఇంటర్నెట్‌ను ప్రతీ ఒక్కరికీ అందించేందుకు తమ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను వివరిస్తూ సీఎం జగన్ ఓ ట్వీట్ చేశారు. ఇందులో భారత్ నెట్ ప్రాజెక్టు స్పూర్తితో డిజిటల్ పబ్లిక్ లైబ్రరీలు ఏర్పాటు చేస్తున్నట్లు, ప్రతీ గ్రామంలో నాణ్యమైన ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి తీసుకురావడం ద్వారా వర్క్ ఫ్రమ్ హోమ్ సంస్కృతికి ఎలాంటి ఆటంకాలు లేకుండా చూస్తున్నట్లు సీఎం జగన్ తాజాగా ట్వీట్ చేశారు.

ఏపీలో భారత్ నెట్ ప్రాజెక్టు స్ఫూర్తితో చేపడుతున్న కార్యక్రమాలపై సీఎం జగన్ చేసిన ట్వీట్‌పై ఇవాళ తమ ఆరో పాలకమండలి సమావేశం సందర్భంగా నీతి ఆయోగ్ స్పందించింది. జగన్ ట్వీట్‌ను రీట్వీట్ చేసింది. ఇప్పటికే కేంద్రం చేపడుతున్న పథకాల స్ఫూర్తితో పలు రాష్ట్రాలు అమలు చేస్తున్న కార్యక్రమాలను నీతి ఆయోగ్ ట్వీట్ చేస్తోంది. ఇదే క్రమంలో ఏపీలో జరుగుతున్న అభివృద్ధి విషయంలోనూ నీతి ఆయోగ్ సీఎం జగన్ ట్వీట్‌ను రీట్వీట్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
In line with the vision of the Bharat Net project, we are establishing digital public libraries & bringing the concept of Work from Home closer by providing uninterrupted access to quality internet in every village: @ysjagan, CM, #AndhraPradesh. #SixthGCM pic.twitter.com/p8DKyYuC5x
— NITI Aayog (@NITIAayog) February 20, 2021












Click it and Unblock the Notifications