అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విభజన.. ఏపీకి చాలా ఇవ్వాలి: అమరావతి సహా వరాలిచ్చిన గడ్కరీ (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ఉపరితల రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ వరాలు కురిపించారు. ఏపీకి రూ.65వేల కోట్ల రహదారి ప్రాజెక్టులు ప్రకటించారు. రు.20వేల కోట్లతో 180 కిలో మీటర్ల మేర అమరావతిలో ఔటర్ రింగ్ రోడ్డు నిర్మిస్తామని చెప్పారు.

శనివారం నాడు విజయవాడ కనకదుర్గమ్మ ఆరువరుసల ఫ్లై ఓవర్ శంకుస్థాపనలో కేంద్రమంత్రులు నితిన్ గడ్కరీ, వెంకయ్య నాయుడు, సుజనా చౌదరి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ఎంపీలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గడ్కరీ వరాలు కురిపించారు.

ఏపీకి రూ.65 వేల కోట్ల విలువైన రహదారి ప్రాజెక్టులను మంజూరు చేస్తామన్నారు. ఈ ప్రాజెక్టులకు సంబంధించిన సవివర నివేదిక, అలైన్‌మెంట్‌ ప్రణాళిక, భూసేకరణ అంశాలను అందిస్తే డిసెంబరు 2016కల్లా పనులు ప్రారంభిస్తామన్నారు.

శంకుస్థాపన

శంకుస్థాపన

కనకదుర్గమ్మ ఫ్లై ఓవర్‌తో పాటు ఎన్‌హెచ్‌ 16- ఎన్‌హెచ్‌ 65 రహదారులను నాలుగు వరుసలకు విస్తరించే పనులు, ఇబ్రహీంపట్నం- చంద్రగూడెం మధ్య ఎన్‌హెచ్‌ 30లో రెండు వరుసల విస్తరణ, కత్తిపూడి- కాకినాడ మధ్య ఎన్‌హెచ్‌ 216ని నాలుగు వరుసలకు విస్తరించే పనులకు శంకుస్థాపన చేశారు.

శంకుస్థాపన

శంకుస్థాపన

బెంజిసర్కిల్‌ పైవంతెన శంకుస్థాపనలోనూ పాల్గొన్నారు. కనకదుర్గ పైవంతెన వద్ద నిర్వహించిన బహిరంగ సభలో నితిన్‌ గడ్కరీ ప్రసంగించారు.

శంకుస్థాపన

శంకుస్థాపన

రహదారుల విస్తరణ, అభివృద్ధితోపాటు జలమార్గాలపైనా రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టాలని సూచించారు. విభజన నేపథ్యంలో ఏపీకి చాలా ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు.

శంకుస్థాపన

శంకుస్థాపన

రాష్ట్రానికి కేటాయించనున్న రూ.65వేల కోట్ల విలువైన పథకాలలో ఇప్పటికే రూ.15 వేల కోట్లకు సంబంధించి జాతీయ రహదారుల పనులు కొనసాగుతున్నాయన్నారు.

శంకుస్థాపన

శంకుస్థాపన

యాక్సెస్‌ కంట్రోల్‌ ఎక్స్‌ప్రెస్‌వేగా అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించాలన్నది చంద్రబాబు ఆలోచన అని, ఇందుకు కేంద్ర సహకారం ఉంటుందన్నారు.

శంకుస్థాపన

శంకుస్థాపన

రాష్ట్ర ప్రభుత్వం కోరినట్లు జాతీయ రహదారుల ప్రాంతీయ కార్యాలయాన్ని విజయవాడలో ఏర్పాటు చేస్తామన్నారు.

 శంకుస్థాపన

శంకుస్థాపన

రహదారుల సుందరీకరణ, పచ్చదనం పెంపునకు నిర్మాణ వ్యయంలో ఒక శాతాన్ని కేటాయిస్తున్నామన్నారు. గన్నవరం విమానాశ్రయం నుంచి విజయవాడ వరకూ రహదారి వెంట పచ్చదనం బాగుందన్నారు.

శంకుస్థాపన

శంకుస్థాపన

లైసెన్సు మంజూరు విధానంలో మార్పులు తీసుకురావాలనుకుంటున్నామన్నారు. ప్రభుత్వ- ప్రైవేట్‌ భాగస్వామ్యంలో ప్రతి శాసనసభ నియోజకవర్గానికి ఒక వాహనచోదక శిక్షణ సంస్థను నెలకొల్పే యోచన ఉందన్నారు. తద్వారా ఐదు లక్షల మందికి ఉపాధి కలుగుతుందన్నారు.

శంకుస్థాపన

శంకుస్థాపన

జలరవాణాకు సంబంధించి బకింగ్‌హామ్‌ కాలువలో సర్వే జరుగుతోందన్నారు. గత కాంగ్రెస్‌ హయాంలో జలరవాణాను నిర్లక్ష్యం చేశారన్నారు.

శంకుస్థాపన

శంకుస్థాపన

తాము నౌకాశ్రయాల అభివృద్ధికి చర్యలు చేపట్టామని వివరించారు. వాటిని ప్రైవేటువారికి అప్పగిస్తే మరింత ఆదాయం వచ్చే అవకాశం ఉందన్నారు.

English summary
The Centre is taking up road projects worth more than Rs 50,000 crore in Andhra Pradesh, including an Outer Ring Road (ORR) at Vijayawada, where the State's new capital city is coming up.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X