వీడని చిక్కుముడి: గుర్తు తెలియని వ్యక్తి మెసేజ్‌లతోనే శశికళకు.., ప్రియురాలి హస్తం!

Posted By:
Subscribe to Oneindia Telugu

విజయవాడ: అమెరికాలో శశికళ, ఆమె కుమారుడు హనీష్‌ సాయి దారుణ హత్యకు గురైన కేసు చిక్కుముడి వీడలేదు. ఈ హత్యల వెనుకఉన్న కారణాలను అమెరికా పోలీసులు నిర్ధారించలేదు.

టెక్కీ హత్య: కేరళ యువతి వల్లే చిచ్చు? రూ.80 లక్షలు..ట్విస్ట్

ఈ నేరానికి సంబంధించి పలు కోణాల్లో విచారణ జరుపుతున్నామని, ఇంకా ఎవరినీ అదుపులోకి తీసుకోలేదని తెలిపారు. మృతి చెందిన వారిపై పలు కత్తిపోట్లు ఉన్నట్లు ప్రాథమిక విచారణలో గుర్తించినట్లు చెప్పారు.

శశికళ, హనీష్ సాయి హత్యపై అనుమానాలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. శశికళ తల్లితండ్రులు.. అల్లుడు హనుమంతరావుపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వివాహేతర సంబంధం కారణంగా ఆయనే చంపి ఉంటాడని ఆరోపిస్తున్నారు. మరోవైపు, తనకు హత్యలతో సంబంధం లేదని హనుమంత రావు చెప్పారు.

అత్త వెళ్లినా.. ప్రియురాలి ప్రమేయం

అత్త వెళ్లినా.. ప్రియురాలి ప్రమేయం

శశికళ కాపురాన్ని చక్కదిద్దడానికి అత్త అమెరికా వెళ్లినా తమ కుమారుడికే వత్తాసు పలికారని శశికళ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. తాను చెప్పినా కుమారుడు వినిపించుకోవడం లేదంటూ తప్పించుకొందని తెలిపారు. అల్లుడి ఆగడాలు, అరాచకాలకు అత్తింటి వారి మద్దతు ఉందని, దీనికి తగిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని వెల్లడించారు. శశికళ అత్తామామలను కూడా విచారించాలన్నారు. హత్యల వెనుక ప్రియురాలి ప్రమేయం ఉండే అవకాశం ఉందన్నారు.

ఇల్లు రాసిస్తేనే కాపురానికి రమ్మన్నాడు

ఇల్లు రాసిస్తేనే కాపురానికి రమ్మన్నాడు

వివాహం తర్వాత కంకిపాడులోని ఇంటిని కుమార్తె పేరుపై రాస్తేనే కాపురానికి తీసుకు వెళ్తానని అల్లుడు హనుమంత రావు వేధించేవాడని శశికళ పేరెంట్స్ తెలిపారు. దీంతో ఇంటిని కుమార్తె పేరుపై రాశామన్నారు. అమెరికాలో ఇంటి ఖర్చులు, హనీష్ సాయి చదువుకయ్యే వ్యయాన్ని శశికళ సంపాదనతోనే భరించినా హనుమంత రావు మాత్రం జీతం దాచుకొంటున్నావంటూ హింసించేవారన్నారు.

పోస్టుమార్టంలో జాప్యం

పోస్టుమార్టంలో జాప్యం

శుక్రవారం ఉదయం హత్యకు గురయ్యారు. వరుసగా వారాంతపు సెలవులు రావడం వల్ల పోస్టుమార్టం ఆలస్యమయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. దీంతో వీరి మృతదేహాలు స్వదేశానికి రావడానికి మరోవారం రోజులు పట్టే అవకాశముందని చెబుతున్నారు.

సందేశాలు

సందేశాలు

శశికళ పడిన ఆవేదన, అల్లుడి ఆగడాలపై తమకు పంపిన మెసేజ్‌లు, మెయిళ్లు, వాట్సప్‌తో పాటు కేరళకు చెందిన తన ప్రియురాలుతో హనుమంతరావు చేసిన ఛాటింగ్‌ సందేశాలను చూపించారు. 'నేను నా భర్త ఎదురుగా నిలబడి నీపై నాకున్న అభిప్రాయాన్ని చెప్పగలను. నువ్వు నీ భార్య ఎదురుగా నిలబడి నాతో ఉన్న అనుబంధాన్ని వివరించగలవా' అని ప్రశ్నించినట్లు ఛాటింగ్‌లో ఉందని వెల్లడించారు.

గుర్తు తెలియని వ్యక్తులు మెసేజ్ చేసేవారు

గుర్తు తెలియని వ్యక్తులు మెసేజ్ చేసేవారు

'నీ భార్యకు నీవు భయపడని వాడివైతే నా గురించి ఎందుకు చెప్పలేవ'ని ప్రియురాలు హనుమంతురావును ప్రశ్నించినట్లు ఉందని చెప్పారు. కాపురం నిలబెట్టుకోవడం, భర్తను మంచి మనిషిగా మార్చుకోవడానికి తమ కుమార్తె చేయని ప్రయత్నం అంటూ లేదని తెలిపారు. హనుమంతరావు అక్రమ సంబంధం వ్యవహారాలపై నిత్యం తమ కుమార్తెకు గుర్తుతెలియని వ్యక్తులు మెసేజ్‌లు పంపేవారన్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Authorities continued to search this weekend for the person who stabbed a mother and her young son to death in their South Jersey apartment last week.
Please Wait while comments are loading...