రాజమండ్రి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏం జరుగుతుందో క్లారిటీ లేదు: విభజనపై ఉండవల్లి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Undavalli Arun Kumar
రాజమండ్రి/న్యూఢిల్లీ: విభజన అంశంపై ఏం జరుగుతోందో, ఏం జరగనుందో చాలామందికి స్పష్టత లేదని రాజమండ్రి పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ గురువారం అన్నారు. ఆయన ఉదయం రాజమండ్రిలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

విభజన అంశంలో ప్రతివాళ్లు తమకు అనుకూలమైన ప్రకటనలు చేస్తున్నారన్నారు. అయితే ఈ విషయంలో ఏం జరుగుతుందో ఎవరికి క్లారిటీ లేదన్నారు. తెలంగాణ కోరుకుంటున్న తొమ్మిది జిల్లాల ప్రజలు, సమైక్యమంటున్న సీమాంధ్ర ప్రాంత జిల్లా వారు ఎవరికి వారు అనుకూలంగా మాట్లాడుతున్నారన్నారు.

అయితే శాసన సభలో అత్యధిక సభ్యులు ఒప్పుకోకుంటే విభజనకు రాజ్యాంగం ఒప్పుకుంటుందా తెలియదన్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజన రాష్ట్ర సమస్య కాదని దేశ సమస్య అన్నారు. ఆర్టికల్ 3లో మద్రాసు నుండి ఎపి విడిపోవడాన్ని చెప్పారని ఉండవల్లి తెలిపారు.

ప్రధాని కార్యాలయ అధికారులతో గవర్నర్ భేటీ

న్యూఢిల్లీ పర్యటనలో బిజీ బిజీగా గడుపుతున్న రాష్ట్ర గవర్నర్ నరసింహన్ గురువారం ప్రధానమంత్రి కార్యాలయం అధికారులతో సమావేశమయ్యారు. కేంద్ర జౌళీ శాఖ మంత్రి కావూరి సాంబశివ రావుతోను పలు అంశాలపై చర్చించారు.

English summary
Rajahmundry MP Undavalli Arun Kumar on Thursday said no one have clarity on Andhra Pradesh division issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X