విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రాజ్యసభ సీటుపై చిరంజీవి తేల్చేసారు - ఎంపీ గా ఆఫర్ వస్తే : సీఎం జగన్ తో చర్చల వేళ..!!

By Chaitanya
|
Google Oneindia TeluguNews

మెగాస్టార్ చిరంజీవి తన మనసులో మాట వెల్లడించారు. ప్రస్తుతం ఏపీలో నెలకొన్ని సినీ సమస్యల పైన సీఎం జగన్ ఆహ్వానం మేరకు చిరంజీవి లంచ్ భేటీ అయ్యారు. ఇద్దరి మధ్య జరిగిన చర్చల పైన చిరంజీవి సంతోషం వ్యక్తం చేసారు. తనకు లభించిన అతిథ్యం పైనా ఆనందపడ్డారు. తాను చెప్పిన అన్ని అంశాలను సీఎం జగన్ నోట్ చేసుకోవటంతో పాటుగా.. తప్పకుండా అందరికీ మేలు చేసే నిర్ణయాలు తీసుకుంటానంటూ సీఎం హామీ ఇచ్చారంటూ చిరంజీవి చెప్పుకొచ్చారు.

సీఎంతో సమావేశంలో కొత్త కోణం

సీఎంతో సమావేశంలో కొత్త కోణం

ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ సినిమా టిక్కెట్ల అంశం పైన అధ్యయనం చేస్తుందని..దీని పైన డ్రాఫ్ట్ అందిన తరువాత చిరంజీవితో సమావేశమై జీవో పైన నిర్ణయం తీసుకుందామంటూ సీఎం చెప్పారని చిరంజీవి వివరించారు. ఇక, సినిమా పెద్దగా సీఎం జగన్ అన్ని అంశాల పైన చిరంజీవితో మాత్రమే మాట్లాడటం..ప్రస్తుత రాష్ట్రంలో నెలకొన్ని రాజకీయ పరిణామల నేపథ్యంలో పొలిటికల్ గానూ టర్న్ తీసుకుంది. వైసీపీ నుంచి చిరంజీవికి రాజ్యసభ ఆఫర్ ఇచ్చే అవకాశం ఉందని ప్రచారం సాగింది. దీని పైన చిరంజీవి స్పందించారు.

రాజ్యసభ ఆఫర్ లేదు..రాదు

రాజ్యసభ ఆఫర్ లేదు..రాదు

కాంగ్రెస్ పార్టీలో ప్రజారాజ్యం విలీనం తరువాత ఆయన మన్మోహన్ సారధ్యంలో మంత్రిగా పని చేసారు. రాష్ట్ర విభజన తరువాత ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినట్లుగా ఎక్కడా అధికారికంగా చెప్పకపోయినా.. పార్టీ వ్యవహారాల్లో పాల్గొనటం లేదు. దీంతో...ప్రస్తుతం జరుగుతున్న రాజ్యసభ సీటు పైన స్పందించిన చిరంజీవి తాను రాజకీయాలకు దూరంగా ఉన్న సమయంలో తనకు అలాంటి ఆఫర్లు రావని వ్యాఖ్యానించారు. తాను అలాంటి ఆఫర్లు కోరుకోనని తేల్చి చెప్పారు. తాను రాజకీయాలకు పూర్తిగా దూరమంటూ చిరంజీవి తేల్చి చెప్పారు.

రాజకీయాలకు దూరమంటూ క్లారిటీ

రాజకీయాలకు దూరమంటూ క్లారిటీ

తాను ఈ రకమైన ప్రచారాన్ని పూర్తిగా ఖండిస్తానంటూ స్పష్టంగా చెప్పారు. తనకు రాజ్యసభ సీటు అనేది కేవలం ప్రచారం మాత్రమేనని తేల్చి చెప్పారు. తాను రాజకీయాలకు దూరమని చిరంజీవి..ఈ మొత్తం ప్రచారానికి చెక్ పెట్టారు. చిరంజీవి ప్రస్తుతం నాలుగు సినిమాల లైనప్ లో ఉన్నాయి. వచ్చే నెల తొలి వారంలో ఇప్పటికే పూర్తి చేసిన ఆచార్య పూర్తి విడుదల కానుంది. ఇక, తాను తిరిగి రాజకీయాల వైపు వెళ్లే అవకాశం లేదనే విధంగా చిరంజీవి స్పష్టత ఇచ్చారు. తన సోదరుడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ నడుపుతున్న సమయంలో..తాను ఇక రాజకీయంగా వెళ్లి... కొత్త వివాదాలు.. సమస్యలకు కారణంగా కాకూడదనే భావనతో చిరంజీవి దీని పైన ఒకే ప్రకటనతో స్పష్టత ఇచ్చినట్లుగా కనిపిస్తోంది.

English summary
Chiranjeevi had clarified that CM Jagan had not offered him the Rajyasabha seat and that it was only a gossip
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X