అవిశ్వాసంపై డివిజన్ కోరండి, 50 మంది ఎంపీల సంతకాలు మోడీ డైరెక్షన్‌లో కెసిఆర్ ఫ్రంట్?: టిడిపి

అమరావతి: కేంద్రంపై అవిశ్వాస తీర్మానంపై డివిజన్‌ను కోరాలని టిడిపి చీఫ్ చంద్రబాబునాయుడు టిడిపి ఎంపీలను ఆదేశించారు. పార్లమెంట్ వాయిదా పడినా కానీ నిరసనలను కొనసాగించాలని చంద్రబాబునాయుడు పార్టీ ఎంపీలను ఆదేశించారు.మరో వైపు

కేంద్రంపై అవిశ్వాస తీర్మానాన్ని టిడిపి, వైసీపీలు నోటీసులు ఇచ్చాయి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని ఈ రెండు పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి.
ఈ రెండు పార్టీలు తమ అవిశ్వాస తీర్మానానికి మద్దతును కూడగడుతున్నాయి. ఇప్పటికే 50 మంది ఎంపీలు అవిశ్వాసానికి మద్దతుగా సంతకాలు చేశారని ఎంపీలు బాబుకు వివరించారు

సభలో సోమవారం నాడు అనుసరించాల్సిన వ్యూహంపై టిడిపి చీఫ్ చంద్రబాబునాయుడు పార్టీ ఎంపీలతో టెలికాన్పరెన్స్ నిర్వహించారు. పార్టీ ఎంపీలు కేంద్రాన్ని ఇరుకున పెట్టే విధంగా వ్యవహరించాలని పార్టీ నేతలకు బాబు సూచించారు.ఇప్పటికే 50 మంది ఎంపీలు అవిశ్వాసానికి మద్దతుగా సంతకాలు చేశారని ఎంపీలు బాబుకు వివరించారు

అవిశ్వాసంపై డివిజన్ కోరండి

అవిశ్వాసంపై డివిజన్ కోరండి

కేంద్రంపై అవిశ్వాసంపై డివిజన్ కోరాలని టిడిపి చీఫ్ చంద్రబాబునాయుడు ఎంపీలతో సోమవారం నాడు టెలికాన్పరెన్స్‌లో ఆదేశించారు. అవిశ్వాస తీర్మానంపై పలు పార్టీల మద్దతును కూడగట్టాలని డిమాండ్ చేశారు . రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ పడకూదని బాబు పార్టీ నేతలకు సూచించారు.

పార్లమెంట్ వాయిదా పడిన నిరసనలు కొనసాగించాలి

పార్లమెంట్ వాయిదా పడిన నిరసనలు కొనసాగించాలి

పార్లమెంట్ వాయిదా పడిన నిరసనలను కొనసాగించాలని టిడిపి చీఫ్ చంద్రబాబునాయుడు పార్టీ ఎంపీలకు సూచించారు. పార్లమెంట్‌లో ఏపీ ప్రయోజనాల కోసం కేంద్రాన్ని నిలదీయాలని బాబు సూచించారు.

తప్పుడు ప్రచారం చేస్తున్నారు

తప్పుడు ప్రచారం చేస్తున్నారు

జాతీయ రాజకీయాల్లోకి తాను వస్తున్నానని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని టిడిపి చీఫ్ చంద్రబాబునాయుడు పార్టీ ఎంపీలకు చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే జాతీయ స్థాయిలో రాజకీయపార్టీలతో సంప్రదింపులు జరిపినట్టు చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో సహకరించాలని కోరినట్టు బాబు పార్టీ ఎంపీలకు చెప్పారు.

పవన్ కళ్యాణ్‌ది తప్పు

పవన్ కళ్యాణ్‌ది తప్పు

రాష్ట్ర కోసం అహర్నిశలు పనిచేస్తున్న తనను లక్ష్యంగా చేసుకొని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ విమర్శలు చేయడం సరైందికాదని టిడిపి చీఫ్ చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు. ఈ విషయమై పవన్ కళ్యాణ్ విమర్శలు చేయడం తప్పుగా ఆయన అభిప్రాయపడ్డారు. మరో వైపు రాష్ట్రంలో చోటు చేసుకొన్న పరిణామాలను ప్రజలు గమనిస్తున్నారని బాబు చెప్పారు.

ఆ పార్టీల తప్పులను ప్రజలు గమనిస్తున్నారు.

ఆ పార్టీల తప్పులను ప్రజలు గమనిస్తున్నారు.

వైసీపీ, జనసేన, బిజెపి చేస్తున్న తప్పులను ప్రజలు గమనిస్తున్నారని టిడిపి చీఫ్ చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో మూడు పార్టీలు అనుసరించిన విధానాలను బాబు తప్పుబట్టారు.ఎన్డీఏ నుండి టిడిపి బయటకు వచ్చిన సమయంలో స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయని చంద్రబాబు దృష్టికి కొందరు ఎంపీలు తీసుకెళ్ళారు.

కెసిఆర్ తీరుపై అనుమానాలు

కెసిఆర్ తీరుపై అనుమానాలు


థర్డ్ ఫ్రంట్ అంటూ బిజెపి, కాంగ్రెసేతర పార్టీలకు వ్యతిరేకంగా కూటమిని ఏర్పాటు చేస్తామని ప్రకటించిన తెలంగాణ సీఎం కెసిఆ్ర తీరుపై టెలికాన్పరెన్స్‌లో చర్చించారు.అవిశ్వాసానికి టిఆర్ఎస్ మద్దతు ఇవ్వకపోవడంపై అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే మోడీ డైరెక్షన్‌లో టిఆర్ఎస్ పనిచేస్తోందనే అభిప్రాయాన్ని కొందరు ఎంపీలు వ్యక్తం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+