అవిశ్వాసం ఎఫెక్ట్: జేసీ దెబ్బకు దిగొచ్చిన బాబు, అసంతృప్తికి కారణాలెన్నో
అమరావతి: తనకు అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డితో ఎలాంటి విభేదాలు లేవని ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి గురువారం వెల్లడించారు. అసలు ఆయన తనను ఎందుకు వ్యతిరేకిస్తున్నారో తెలియదని వాపోయారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచన మేరకు జేసీతో కలిసి ముందుకు సాగుతానని చెప్పారు.
జేసీ దివాకర్ రెడ్డి పార్లమెంటుకు వెళ్తారో లేదో ఆయన ఇష్టమని, దీనిపై ఆయన స్పష్టం చేయాలన్నారు. కాగా, టిడిపి అధిష్టానంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న జేసీ శుక్రవారం నాడు అవిశ్వాస తీర్మానానికి హాజరు కానని చెప్పారు. టీడీపీలో ఇది కలకలం రేపింది. ఆయనను బుజ్జగించేందుకు నేతలు రంగంలోకి దిగారు.
{photo-feature}












Click it and Unblock the Notifications