పుణెలో అదృశ్యం: 15నెలలైనా లభ్యంకాని తెలుగు టెక్కీ ఆచూకీ

పుణె/కృష్ణా: మహారాష్ట్రలోని పుణెలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా విధులు నిర్వహిస్తూ అదృశ్యమైన శ్రీ హర్షరెడ్డి(28) ఆచూకీ ఇప్పటికీ లభ్యం కాలేదు. 15నెలలుగా అతని ఆచూకీ తెలియకపోవడంతో హర్షరెడ్డి కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు.

హర్షరెడ్డి స్వస్థలం విజయవాడ రూరల్ మండలం నున్న. పుణెలోని వోడాఫోన్‌ కార్యాలయంలో హర్షరెడ్డి పనిచేస్తున్నారు. కాగా, విధులకు రాకపోయినా 10నెలలుగా జీతాన్ని హర్ష ఖాతాలో కంపెనీ వేస్తోంది.

No details found about missing techie Harsh Reddy

ఈ క్రమంలో హర్షరెడ్డి అదృశ్యానికి కంపెనీవాళ్లే కారణమని తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. న్యాయం చేయాలంటూ మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావుకు వారు వినతిపత్రం అందజేశారు. 2016, ఆగస్టు 6న హర్షరెడ్డి పుణెలో అదృశ్యమయ్యారు.

కాగా, ఇప్పటికే హర్షరెడ్డి అదృశ్యంపై అతని తల్లిదండ్రులు విజయవాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పుణెలోని ఖరాడీ పోలీస స్టేషన్‌లో కూడా హర్షరెడ్డి తండ్రి లక్ష్మారెడ్డి తన కుమారుడి అదృశ్యంపై ఫిర్యాదు చేశారు. హర్షరెడ్డి పనిచేస్తున్న కంపెనీ అతని గురించి ఎలాంటి సమచారం ఇవ్వడం లేదని లక్ష్మారెడ్డి చెప్పారు.

విజయవాడ సీపీకి విజ్ఞప్తి: కంపెనీపైనే అనుమానం, కిడ్నాప్ చేశారా?

విజయవాడ సీపీ గౌతమ్ సవాంగ్‌ను హర్షవర్ధన్ రెడ్డి కుటుంబసభ్యలు శనివారం కలిశారు. తన కొడుకు ఆచూకీని కనుగొనాలని సీపీని హర్షవర్ధన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. తమకు వోడాఫోన్ కంపెనీపైనే అనుమానం ఉందని చెప్పారు. తన కుమారుడికి ఎలాంటి ప్రేమ వ్యవహారాలు లేవని, ఎవరితోనూ శత్రుత్వం కూడా లేదని చెబుతున్నారు. తమ కుమారుడిని కిడ్నాప్ చేసి అతని ఉద్యోగాన్ని ఎవరైనా చేస్తున్నారా? అనే అనుమానం వ్యక్తం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+